Skin Care Tips:నెలరోజులు ఇవి రోజూ తింటే… మీ వయసు 10 ఏళ్లు తగ్గినట్టు కనిపిస్తుంది..!
Skin Care Tips:నెలరోజులు ఇవి రోజూ తింటే… మీ వయసు 10 ఏళ్లు తగ్గినట్టు కనిపిస్తుంది..విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా మారుతుంది. యవ్వనంగా కనిపించడంలో కూడా ఇవి గొప్ప సహాయం చేస్తాయి.
మనం ఏం తింటామో… అదే మన ముఖంపై ప్రతిబింబిస్తుంది. ఆహారం మీదే అందం ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మెరిసే చర్మం, యవ్వన ఛాయలు కావాలంటే… ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి. ప్రతిరోజూ కొన్ని ఆహారాలను డైట్లో చేర్చుకుంటే, ఖరీదైన క్రీములు అవసరం లేకుండానే చర్మం అందంగా మారుతుంది. ఏ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…
క్యారెట్
క్యారెట్ చర్మ అందానికి నంబర్ వన్ ఫుడ్. ఇందులో విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ పుష్కలం. ఇవి UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. రోజూ క్యారెట్ తింటే… చర్మం పొడిబారకుండా, ఎప్పుడూ ఫ్రెష్‌గా, యవ్వనంగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి:హోటల్లో వడ రుచి ఇంట్లో కావాలంటే? సీక్రెట్ టిప్స్ ఇవే..
టమాట
టమాటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంది. ఇది సూర్యరశ్మి నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. రోజూ టమాట తింటే… ముడతలు రావు, చర్మ ఆకృతి మెరుగుపడుతుంది. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు.
అవకాడో
అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంచుతాయి. రోజూ అవకాడో తింటే… ముఖం సాఫ్ట్‌గా మారి, యవ్వన ఛాయలు వస్తాయి.
ఇది కూడా చదవండి:ఇన్స్టాగ్రామ్ Vs ఇన్స్టాగ్రామ్ లైట్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?
పాలకూర
పాలకూర చర్మ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్. ఇందులో ఐరన్, విటమిన్లు A, C, K పుష్కలం. ఇవి చర్మ కణాలకు ఆక్సిజన్ సరఫరా చేసి, ప్రకాశవంతంగా మారుస్తాయి. రోజూ పాలకూర తింటే… చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.
బెర్రీలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు, విటమిన్ సి పుష్కలం. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. రోజూ బెర్రీలు తింటే… ముఖం యవ్వనంగా, మెరిసేలా కనిపిస్తుంది.
ప్రతిరోజూ ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే… చర్మం మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఖరీదైన కాస్మెటిక్స్ అవసరం లేకుండానే… సహజ అందం మీ సొంతం అవుతుంది!

