BusinessToday gold rate

Gold Rate Today:బంగారం ధరలు భారీగా పడిపోయాయి… నవంబర్ 8 శనివారం పసిడి రేట్లు ఇవిగో… తులం బంగారం ఏకంగా ₹13,000 తగ్గింది!

Gold Rate Today:బంగారం ధరలు భారీగా పడిపోయాయి… నవంబర్ 8 శనివారం పసిడి రేట్లు ఇవిగో… తులం బంగారం ఏకంగా ₹13,000 తగ్గింది..ఈ రోజు నవంబర్ 8వ తేదీ శనివారం, నిన్నటి ధరలతో పోల్చితే బంగారం రేట్లు గణనీయంగా తగ్గాయి.

24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర ₹1,22,020గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ₹1,11,850కు చేరింది. ఒక కేజీ వెండి ధర ₹1,53,000గా నమోదైంది. మొత్తంగా నిన్నటితో పోల్చితే పసిడి ధరలు గణనీయంగా క్షీణించినట్టు కనిపిస్తోంది.

బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ధరలు అత్యధిక స్థాయికి చేరిన తర్వాత ఇప్పుడు కరెక్షన్ దశలోకి వచ్చాయి. ముఖ్యంగా వివాహ సీజన్‌లో ఉన్న సామాన్యులకు ఇది గొప్ప ఊరట. ఆల్ టైం హై రికార్డుతో పోల్చితే తులం బంగారం దాదాపు ₹13,000 తక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి:ఈ నూనె రెండు చుక్కలు ముఖానికి రాస్తే… ముడతలు మాయమైపోతాయి!
మార్కెట్‌లో బంగారం ధరలు అతిగా పెరిగి ఓవర్‌బాట్ స్థాయికి వెళ్లడంతో ఇప్పుడు సర్దుబాటు జరుగుతోంది. అక్టోబర్ 20న 24 క్యారెట్ 10 గ్రాములు ₹1.35 లక్షల రికార్డు స్థాయి తాకిన తర్వాత నుంచి క్రమంగా తగ్గుడు ప్రారంభమైంది. ఈ కరెక్షన్ స్వల్పకాలికమే అయినా, డిమాండ్ ఇంకా బలంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం బంగారం ధరల పతనానికి కీలక సూచిక. దీంతో తక్కువ డాలర్లతో ఎక్కువ బంగారం కొనే అవకాశం పెరిగింది. వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగి రెండు లక్షల మార్కు తాకిన తర్వాత ఇప్పుడు కేజీకి ₹1.50 లక్షల స్థాయికి చేరాయి. ఆభరణాల కొనుగోళ్లకు ఇది ఉత్తమ సమయం!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.