Face Glow Tips:పెళ్లి రోజు అందంగా మెరవాలంటే.. అమ్మమ్మల కాలం నాటి సహజ టిప్స్‌తోనే సాధ్యం..
Face Glow Tips:పెళ్లి రోజు అందంగా మెరవాలంటే.. అమ్మమ్మల కాలం నాటి సహజ టిప్స్‌తోనే సాధ్యం.. పెళ్లి రోజు అందంగా మెరవాలంటే.. అమ్మమ్మల కాలం నాటి సహజ టిప్స్‌తోనే సాధ్యం.. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, పెళ్లి శుభవార్తలు మారుమోగుతాయి. ఈ పవిత్ర మాసంలో ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో, చాలా మంది వివాహాలు ఇక్కడే జరుపుకుంటారు.
పెళ్లి కూతురు అందంగా కనిపించాలంటే మార్కెట్‌లో ఖరీదైన ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం సర్వసాధారణం. కానీ ఇంట్లోనే ఉన్న సహజ పదార్థాలతో స్క్రబ్ తయారు చేసుకుంటే, అద్భుతమైన గ్లో వస్తుంది. ఏ పదార్థాలు, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి అనేది జీవితంలో ఒక అమూల్యమైన జ్ఞాపకం. ఆ రోజు ప్రత్యేకంగా, అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి, ఖరీదైన క్రీములు కొనడం కంటే… మన అమ్మమ్మలు వాడిన సహజ స్క్రబ్‌లతోనే మేరిసిపోవచ్చు. రండి, వాటి గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి:నెలరోజులు ఇవి రోజూ తింటే… మీ వయసు 10 ఏళ్లు తగ్గినట్టు కనిపిస్తుంది..!
1. పసుపు + శనగపిండి + గంధం + పాలు + బాదం స్క్రబ్
ఈ పదార్థాలను కలిపి స్క్రబ్ తయారు చేసుకోండి. పెళ్లికి 10 రోజుల ముందు నుంచి రోజూ వాడితే, చర్మం లోతుగా శుభ్రమై, సహజ మెరుపు వస్తుంది.
పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-సెప్టిక్ గుణాలు పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి.గంధం రంధ్రాలను మూసి, ముడతలు తగ్గించి, నిగారింపు ఇస్తుంది.
2. వేప + కలబంద స్క్రబ్ (మొటిమలకు గుడ్‌బై!)
వేపాకులను శుభ్రం చేసి, ఎండబెట్టి పొడి చేయండి. ఆ పొడిని కలబంద జెల్‌తో కలిపి ముఖానికి రాయండి.మొటిమలు తొలగి, చర్మం మృదువుగా, సాఫ్ట్‌గా మారుతుంది.
ఇది కూడా చదవండి:చలికాలంలో ఈ పండు తింటే ఏమి అవుతుందో తెలుసా.
3. బాదం + పచ్చిపాల స్క్రబ్ (నిగారింపుకు సూపర్!)
రాత్రి బాదం పప్పులను పాలల్లో నానబెట్టండి. ఉదయాన తొక్క తీసి, పచ్చిపాలల్లో రుబ్బి స్క్రబ్‌గా తయారు చేయండి. రోజుకు రెండు సార్లు రాయండి.టాన్ తొలగి, చర్మానికి సహజ గ్లో వస్తుంది.ఈ సహజ స్క్రబ్‌లతో పెళ్లి రోజు మీరు సహజంగానే మెరిసిపోతారు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

