Beauty Tips

Cracked Heels: పాదాల మడమల పగుళ్లకు ఇంట్లోనే ఖర్చులేని వైద్యం..ఇలా చేస్తే చాలు..

Cracked Heels: పాదాల మడమల పగుళ్లకు ఇంట్లోనే ఖర్చులేని వైద్యం..ఇలా చేస్తే చాలు.. శీతాకాలం మళ్లీ వచ్చేసింది. పగలు కూడా చలి గజగజలాడుతోంది. ఈ సీజన్ తాజాదనం, చల్లని గాలులతో పాటు చర్మానికి – ముఖ్యంగా పాదాలకు – పెద్ద ఇబ్బంది తెచ్చిపెడుతుంది.తేమ లేకపోవడం, డ్రై విండ్ వల్ల పాదాల చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడి, నిర్జీవంగా కనిపిస్తుంది.చాలా మంది క్రీములు, లోషన్లు ట్రై చేస్తారు.. కానీ రిజల్ట్ జీరో!

మీరు కూడా పాదాల పగుళ్లతో బాధపడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఒక స్పెషల్ ఫుట్ మాస్క్తో పాదాలను మాయిశ్చరైజ్ చేసి, మృదువుగా, అందంగా మార్చుకోవచ్చు.
ఇది కూడా చదవండి:చపాతీలు మిగిలిపోయాయా? వాటితో ఈ 5 సూపర్ రుచికరమైన రెసిపీలు ట్రై చేయండి – లాక్కొని తింటారు!
శీతాకాల స్పెషల్ ఫుట్ మాస్క్
అవసరమైన పదార్థాలు:
బియ్యం పిండి – 1 టీస్పూన్
నిమ్మరసం – ½ నిమ్మకాయ
బాడీ వాష్ – 1 టీస్పూన్
కొబ్బరి నూనె – 2 టీస్పూన్లు

మాస్క్ తయారీ విధానం
ఒక చిన్న గిన్నె తీసుకోండి.అందులో 1 చెంచా బియ్యం పిండి వేయండి.సగం నిమ్మకాయ రసం, 1 చెంచా బాడీ వాష్, 2 చెంచాల కొబ్బరి నూనె కలపండి.అన్నీ బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోండి. రెడీ! మీ హోమ్‌మేడ్ ఫుట్ మాస్క్ సిద్ధం.
ఇది కూడా చదవండి:నల్లేరు మొక్క గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలద్దు..
అప్లై చేసే విధానం
ముందుగా పాదాలను గోరువెచ్చని నీటితో బాగా కడిగి శుభ్రం చేసుకోండి.పేస్ట్‌ను పాదాలకు సమానంగా అప్లై చేయండి (ముఖ్యంగా పగుళ్లు ఉన్న చోట).15-20 నిమిషాలు ఆరనివ్వండి.తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.లాస్ట్‌గా మీ ఫేవరెట్ మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీ రాసుకోండి.

టిప్: వారంలో 2-3 సార్లు ఈ మాస్క్ యూజ్ చేస్తే.. ఒక్క వారంలోనే పాదాలు సిల్క్ లాగా మారతాయి. చలికాలంలో పాదాల పగుళ్ల బెంగ అంతా పోయి.. మీ ఫుట్‌వేర్‌లో కూడా కాంఫిడెంట్‌గా అడుగుపెట్టొచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.