Peepal Leaves: రావి ఆకుపై నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?
Peepal Leaves: రావి ఆకుపై నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా..హిందూ సంప్రదాయంలో రావి చెట్టు (పీపల్ ట్రీ) అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇందులో త్రిమూర్తులు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని, పూర్వజన్మ పాపాలు, శాపాలు, పితృ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
ముఖ్యంగా రావి ఆకుపై నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంటి పూజామందిరంలో ఈ పరిహారం చేయడం వల్ల ఇల్లు నెగెటివ్ ఎనర్జీ నుంచి పూర్తిగా శుద్ధి అవుతుందట!
ఎలా చేయాలి?
రావి చెట్టు నుంచి ఆరోగ్యవంతమైన, ఆకుపచ్చని ఆకులు తీసుకురండి (కోసేటప్పుడు చెట్టుకు నమస్కారం పెట్టుకోవడం మంచిది).ఇంటికి తెచ్చిన ఆకులను శుభ్రమైన నీటితో బాగా కడిగి, తుడిచి పొడిగా చేయండి.ప్రతి ఆకుకు పసుపు, కుంకుమ బొట్టు పెట్టి అలంకరించండి.ఆ ఆకు మీద చిన్న మట్టి ప్రమిద లేదా ఇత్తడి ప్రమిద ఉంచండి.
Also Read:వారంలో 2 సార్లు ఈ ప్యాక్స్ వాడితే జుట్టును బలంగా, మెరిసేలా, ఒత్తుగా చేస్తాయి..
ప్రమిదలో నువ్వుల నూనె పోసి, గీత వెలిగించండి.ఈ దీపాన్ని పూజా మందిరంలో రోజూ సాయంత్రం వెలిగించి, ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా రావి చెట్టు స్తోత్రం చదువుతూ ఆరాధించండి.
ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:పూర్వజన్మ శాపాలు, పితృ దోషాలు తొలగుతాయి.శని దోషం, గ్రహ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇంట్లో సకల శుభాలు, ధనలాభం, ఆరోగ్యం కలుగుతాయి.అడ్డంకులు తొలగి, చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.మనశ్శాంతి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి.
ఈ పరిహారాన్ని ముఖ్యంగా శనివారం, అమావాస్య, ఏకాదశి రోజుల్లో చేయడం అత్యంత శ్రేష్ఠం. భక్తి శ్రద్ధలతో చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య, ఆధ్యాత్మిక పండితుల అభిప్రాయం.
Also Read:తెల్ల ఆవాలతో కలిగే లాభాలు తెలిస్తే వాటిని వదిలిపెట్టకుండా తింటారు..
Also Read:ఈ Dosa తింటే అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఆరోగ్యంగా ఉంటారు

