Business

IRCTC Vizag Tour:ఐఆర్‌సిటిసి” వైజాగ్-అరకు-సింహాచలం టూర్‌”ప్యాకేజీ.. 3 రోజులు..

IRCTC Vizag Tour:ఐఆర్‌సిటిసి టూరిజం “వైజాగ్ రిట్రీట్” పేరిట అద్భుతమైన 3 రోజులు – 2 రాత్రుల టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో విశాఖపట్నం, అరకు వ్యాలీ, సింహాచలం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. నవంబర్ 17 నుంచి ఈ టూర్ అందుబాటులో ఉంది.

టూర్ వివరాలు (Itinerary)
Day 1: విశాఖపట్నం లోకల్ సైట్‌సీయింగ్
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు / రైల్వే స్టేషన్ / బస్టాండ్ నుంచి పికప్
హోటల్‌లో చెక్-ఇన్, ఫ్రెషప్, లంచ్ వరకు విశ్రాంతి
మధ్యాహ్నం తర్వాత: తొట్లకొండ బౌద్ధ స్థూపాలు, కైలాసగిరి, రుషికొండ బీచ్
సాయంత్రం హోటల్‌కు తిరిగి వచ్చి డిన్నర్ & రాత్రి బస

Day 2: అరకు వ్యాలీ ఫుల్ డే టూర్
ఉదయం 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అరకు బయలుదేరుతారు
సందర్శన స్థలాలు:
• టైడా జంగిల్ బెల్స్
• పద్మాపురం బొటానికల్ గార్డెన్స్
• ట్రైబల్ మ్యూజియం
• అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్
• గాలికొండ వ్యూపాయింట్
• బొర్రా గుహలు
లంచ్ సొంత ఖర్చు
సాయంత్రం విశాఖపట్నం తిరిగి వచ్చి డిన్నర్ & రాత్రి బస

Day 3: సింహాచలం & డ్రాప్
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్-అవుట్
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (సింహాచలం) దర్శనం
సబ్‌మెరైన్ మ్యూజియం సందర్శన
బీచ్ రోడ్ డ్రైవ్
లంచ్ సొంత ఖర్చు
ఎయిర్‌పోర్టు / రైల్వే స్టేషన్ / బస్టాండ్ వద్ద డ్రాప్

ప్యాకేజీలో ఏమి ఉంటుంది?
2 రాత్రులు ఏసీ హోటల్‌లో వసతి (కంఫర్ట్ కేటగిరి)
ఏసీ వాహనంలో పూర్తి ప్రయాణం, పికప్ & డ్రాప్
బ్రేక్‌ఫాస్ట్ (Day-2 & Day-3), డిన్నర్ (Day-1 & Day-2)
ట్రావెల్ ఇన్సూరెన్స్ & GST ఇన్‌క్లూసివ్

ధరల వివరాలు (పర్ పర్సన్, కంఫర్ట్ క్లాస్)
ట్రిపుల్ షేరింగ్ : ₹8,055
డబుల్ షేరింగ్ : ₹11,075
సింగిల్ ఆక్యుపెన్సీ : ₹20,125
చైల్డ్ (5-11 సంవత్సరాలు)
→ ఎక్స్‌ట్రా బెడ్‌తో : ₹6,750
→ బెడ్ లేకుండా : ₹4,415

ఆసక్తి ఉన్నవారు https://www.irctctourism.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, తేదీలు, అందుబాటు కోసం అధికారిక సైట్‌ను సందర్శించగలరు. ఈ అద్భుతమైన వైజాగ్-అరకు-సింహాచలం టూర్‌ను మిస్ చేయకండి..ఇప్పుడే బుక్ చేసుకోండి!

గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

ALso Read:వెల్లుల్లి స్ప్రే ఇలా తయారుచేసుకోండి.. ఇంట్లో ఒక్క దోమ కూడా కనిపించదు!

Also Read:24 గంటలు ఫ్రీ ఆక్సిజన్ ఇచ్చే ఈ మొక్క మీ ఇంటిలో ఉందా..