Rudraksha:ఏకాదశ ముఖి రుద్రాక్ష – ఒక్కటే చాలు… హనుమాన్ శక్తి + ఏకాదశ రుద్రుల అనుగ్రహం!
Rudraksha:ఏకాదశ ముఖి రుద్రాక్ష – ఒక్కటే చాలు… హనుమాన్ శక్తి + ఏకాదశ రుద్రుల అనుగ్రహం..ఒక్క ఏకాదశ ముఖి రుద్రాక్ష ధరిస్తేనే చాలు… కుజదోషం పూర్తిగా తొలగిపోతుంది, అపమృత్యు భయం ఎప్పటికీ దరిచేరదు, ఎల్లవేళలా అదృష్టం మీ వెంట ఉంటుంది. హనుమంతుడితో పాటు 11 మంది రుద్రులు మీకు రక్షకులుగా నిలుస్తారు!
ఏకాదశ ముఖి రుద్రాక్ష గొప్పతనం
11 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్షను హనుమాన్ స్వరూపంగా పూజిస్తారు.పద్మ పురాణం ప్రకారం ఇది ఏకాదశ రుద్రుల (అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్యుడు, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, త్వష్ట, ఈశానుడు, త్రిభువనుడు, అపరాజితుడు) సమ్మిళిత శక్తి.ఈ ఒక్క రుద్రాక్ష ధరిస్తే ఈ 11 రుద్రులు ఎప్పుడూ మీతోనే ఉంటారని పురాణ వచనం.
ALSO READ:మహిళలు ఇంటి విద్యుత్ వినియోగంలో ఈ సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే… సంవత్సరానికి ₹50,000 వరకు ఆదా..
ఎవరు ధరించవచ్చు?
ఏ రాశి వాళ్లైనా ధరించవచ్చు – ప్రత్యేక నియమం లేదు.
కానీ ప్రత్యేక ఫలితాలు:
కుజ దోషం, మంగళ బలహీనత ఉన్నవారికి తప్పనిసరి.శని పీడలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు (ఆయుర్వేద దృష్ట్యా)
జీర్ణకోశ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్..
కాలేయం, ఛాతీ సంబంధిత రోగాలు
రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు నియంత్రణ
శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా మెరుగుపడతాయి
ALSO READ:పాలలో ఖర్జూరం నానబెట్టి తాగితే జరిగే అద్భుత ప్రయోజనాలు
ఆధ్యాత్మిక & ఇతర ఫలితాలు
ఇంద్రియ నిగ్రహం, మనస్సు ఏకాగ్రత
ధ్యానం, యోగం, కుండలినీ జాగృతానికి అతి ముఖ్యం
సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి
ధైర్యం, జ్ఞానం, విజయం, దీర్ఘాయుష్షు
అకాల మృత్యు భయం పూర్తిగా తొలగుతుంది
ఎప్పుడూ ప్రయాణం చేసే వారికి, వ్యాపారస్తులకు అద్భుత రక్ష
నెట్వర్కింగ్, HR, లీడర్షిప్ ఉద్యోగాల్లో అద్భుత ప్రగతి
ఎప్పుడు, ఎలా ధరించాలి?
ఉత్తమ రోజులు: సోమవారం లేదా మంగళవారం
ప్రత్యేక రోజులు: మాస శివరాత్రి, హనుమాన్ జయంతి, కార్తీక మాసంలోని శుభ దినాలు
ధారణ విధానం:
పట్టు లేదా ఉన్ని దారంలో ఒంటరిగా ధరించవచ్చు
వెండి/బంగారు కవచంలో పొదిగించుకోవచ్చు
మాల, కంకణం, గొలుసుగా కూడా ధరించవచ్చు
“ఓం నమః శివాయ” లేదా “ఓం హ్నౌం నమః” మంత్రాన్ని కనీసం ౨౧ సార్లు జపించి ధరించండి
ప్రత్యేక నియమాలు ఏమీ లేవు… కేవలం ఎప్పుడూ పవిత్రంగా ఉంచండి.ఒక్క ఏకాదశ ముఖి రుద్రాక్ష… మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి!హనుమాన్ అనుగ్రహం + 11 రుద్రుల రక్ష + కుజదోష నివారణ… ఇవన్నీ ఒక్క రుద్రాక్షలోనే!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
ALSO READ:మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/

