Devotional

Vaikunta Ekadashi:వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి!

Vaikunta Ekadashi:వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి..వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశి వ్రతాలలో ఒకటి. ఈ రోజు శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) గుండా భక్తులకు దర్శనమిస్తాడని, ఈ ద్వార దర్శనం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల గాఢ విశ్వాసం.

వైకుంఠ ఏకాదశి 2025 తేదీ & తిథి వివరాలు (తెలుగు పంచాంగం ప్రకారం)
తిథి ప్రారంభం: డిసెంబర్ 30, 2025 (మంగళవారం) ఉదయం 07:51 గంటలకు
తిథి ముగింపు: డిసెంబర్ 31, 2025 (బుధవారం) ఉదయం 05:01 గంటలకు
వ్రతం – పండుగ ఆచరణ తేదీ: డిసెంబర్ 30, 2025 (మంగళవారం) – సూర్యోదయ తిథి ప్రకారం
ALSo Read:పూజకి సంబంధించి అన్ని రకాల వస్తువులు ఒకే చోట.. చాలా తక్కువ ధరలో..
ఈ రోజుకు ఎందుకు ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు?
మూడు కోట్ల (ముక్కోటి) దేవతలు శ్రీమహావిష్ణువుతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని పురాణ వచనం.
ఒక్క ఈ ఏకాదశి వ్రతం మూడు కోట్ల ఏకాదశి వ్రతాల ఫలితాన్ని ఇస్తుందని మరో విశ్వాసం.
పాలకడలి మథనం సమయంలో అమృతం ఉద్భవించిన రోజు కూడా ఇదేనని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.
మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతోపదేశం చేసిన రోజు కూడా ఈ ముక్కోటి ఏకాదశి అని భక్తుల నమ్మకం.

వైకుంఠ ఏకాదశి వ్రత ఫలితాలు
ఉపవాసం, జాగరణ, విష్ణు-లక్ష్మీ పూజ, గోవింద నామ స్మరణ, భాగవత శ్రవణం చేస్తే మోక్ష ప్రాప్తి.
ఈ వ్రతం ఆచరించిన వారికి మరో జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
కనీసం “ఓం నమో నారాయణాయ” అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినా మహా ఫలితం.
ALSO READ:మహిళలు బట్టల షాపింగ్‌లో ఈ 7 జాగ్రత్తలు తీసుకుంటే… ప్రతి సంవత్సరం లక్షలు ఆదా..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 2025
డిసెంబర్ 30, 2025 నుంచి జనవరి 8, 2026 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది.
డిసెంబర్ 30, 31 & జనవరి 1 తేదీలకు ఆన్‌లైన్‌లో SSD టోకెన్లు (నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు బుక్ చేసుకోవాలి).
జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుంచి నేరుగా సర్వదర్శనం.

శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి
21 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు (పాగల్ పట్టు & రాత్రి పట్టు ఉత్సవాలు)…వైకుంఠ ఏకాదశి రోజు రంగనాథస్వామిని రత్న కవచంతో అలంకరించి, వజ్రాల వస్త్రాలతో వెయ్యి స్తంభాల మండపం గుండా వైకుంఠ ద్వారం నుంచి తీసుకొచ్చి దర్శనం కల్పిస్తారు.ఈ ద్వారం దాటిన భక్తుడు నేరుగా వైకుంఠం చేరుకుంటాడని నమ్మకం.ఈ రోజు తెల్లవారుజామునే స్నానం చేసి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉపవాస-జాగరణతో గడిపితే అపార పుణ్యఫలితం కలుగుతుందని శాస్త్ర-పురాణాలు చెబుతున్నాయి.

గమనిక: ఈ వివరాలు సంప్రదాయ పంచాంగాలు, పురాణ వచనాలు, ఆలయ అధికారిక ప్రకటనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. మత విశ్వాసాలు వ్యక్తిగతం.

మరిన్ని భక్తీ విషయాల కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/