Business

Money Tips:మహిళలు వంటింట్లో ఈ అలవాట్లు పాటిస్తే… సంవత్సరానికి ₹40,000 నుంచి ₹60,000 వరకు సులువుగా ఆదా!

Money Tips:మహిళలు వంటింట్లో ఈ అలవాట్లు పాటిస్తే… సంవత్సరానికి ₹40,000 నుంచి ₹60,000 వరకు సులువుగా ఆదా..ఇంటి ఆర్థిక బాధ్యతలో భర్త-భార్యలిద్దరూ సమానంగా ఉన్నా, రోజువారీ ఖర్చులు, వంటింటి నిర్వహణ ఎక్కువగా గృహిణుల భుజాలపైనే పడుతుంది.

అలాంటి గృహిణులు కేవలం వంటింట్లోనే కొన్ని చిన్న మార్పులు చేస్తే… ప్రతి సంవత్సరం ₹50,000 వరకు సులువుగా మిగుల్చుకోవచ్చు. ఈ డబ్బును రికరింగ్ డిపాజిట్ లేదా మ్యూచువల్ ఫంఢ్స్‌లో పెడితే మరింత పెరిగి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతగా మారుతుంది.ఇప్పుడు ఆ ఐదు సూపర్ ఆదా టిప్స్ చూద్దాం:

సీజన్ సేల్‌ను అదిరిపోయేలా ఉపయోగించుకోండి!
జనవరి–మార్చి మధ్య బియ్యం, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, గోధుమపిండి, నూనె, పోపు దినుసులు… ఇలా సంవత్సరం మొత్తానికి సరిపడే వస్తువులను ఒకేసారి హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనేయండి.
ALSO READ:పూజకి సంబంధించి అన్ని రకాల వస్తువులు ఒకే చోట.. చాలా తక్కువ ధరలో..
ప్రెషర్ కుక్కర్‌ను మీ బెస్ట్ ఫ్రెండ్ చేసుకోండి
అన్నం, కూరలు, పప్పు, దాల్చా… దాదాపు అన్నీ ప్రెషర్ కుక్కర్‌లోనే చేయండి. ఒక్కో సిలిండర్‌లో ౩–4 రోజులు ఎక్కువ వాడుకోవచ్చు.

డీప్ ఫ్రై మానేసి… హెల్తీ + వాలెట్ హ్యాపీగా మారండి
వారానికి ౩–4 రోజులు నూనె వేపుళ్లు తగ్గిస్తే నెలకు ౩–4 లీటర్ల నూనె మిగులుతుంది.

“ఎంత కావాలో అంతే వండండి” – ఫుడ్ వేస్టేజ్‌ను జీరో చేయండి
ఉదయమే రోజంతా మెనూ ప్లాన్ చేసుకోండి. మిగిలిన అన్నం ఉప్మా, పులిహోర, ఇడ్లీలుగా మార్చండి.

మిగిలిన డబ్బును “పడనివ్వకండి” – పొదుపు చేయండి
ఈ చిన్న చిన్న ఆదాలన్నీ కలిపి నెలకు ₹౩,౦౦౦–4,౦౦౦ మిగులుతాయి. దాన్ని రికరింగ్ డిపాజిట్ లేదా SIPలో పెడితే… 5 సంవత్సరాల్లో ₹౩–4 లక్షలు సులువుగా పోగవుతాయి!
ALSO READ:రూ.16,686 విలువ గల పిల్లో కేవలం రూ.7,173కే.. 57 శాతం తగ్గింపుతో..
ఈ అలవాట్లు మీ వంటింట్లో అమలు చేస్తే… మీరు ఇంటి ఆర్థిక మంత్రి మాత్రమే కాదు, ఇంటి ఆర్థిక మాంత్రికురాలు అవుతారు.. మొదలుపెట్టడానికి ఈ నెలే బెస్ట్ టైమ్… ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

ఇలాంటి చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/