Devotional

Vastu Tips:ఇంటి గోడలపై రావి చెట్లు పెరిగితే అశుభమే.. అక్కడ అద్దెకు కూడా ఉండకూడదంట వాస్తు నిపుణుల సూచన..

Vastu Tips:ఇంటి గోడలపై రావి చెట్లు పెరిగితే అశుభమే.. అక్కడ అద్దెకు కూడా ఉండకూడదంట వాస్తు నిపుణుల సూచన.. వాస్తు శాస్త్రంలో రావి చెట్టు (పీపల్ ట్రీ) గురించి చాలా కఠిన నియమాలు ఉన్నాయి. హిందూ ధర్మంలో రావి చెట్టు అత్యంత పవిత్రమైనది, దాన్ని పూజించడం వల్ల పితృదోషాలు, శాంతిస్తాయని, శని దోషాలు తొలగుతాయని నమ్మకం. కానీ అదే రావి చెట్టు ఇంటి గోడల మీద, పై కప్పు మీద లేదా ఇంటి చుట్టూ అనావశ్యకంగా పెరిగితే మాత్రం వాస్తు ప్రకారం అతి పెద్ద దోషంగా పరిగణిస్తారు.

ఎందుకు అశుభం?
రావి చెట్టు చాలా వేగంగా పెరిగే స్వభావం కలిగి ఉంటుంది. గోడల్లోని పగుళ్లలోకి రూట్లు పాకి, కొద్ది రోజుల్లోనే గోడలు పడగొట్టేంత బలంగా మారుతుంది.వాస్తు దృష్ట్యా ఇంటి మీద పెరిగే రావి చెట్టు “నెగెటివ్ ఎనర్జీ”ని పెంచుతుందని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అకాల మరణాలు, అనారోగ్యాలు రావడానికి కారణమవుతుందని చెబుతారు.ముఖ్యంగా ఇంటి పై కప్పు లేదా గోడలపై 4–5 కంటే ఎక్కువ రావి మొకలు ఉంటే అది తీవ్రమైన వాస్తు దోషంగా భావిస్తారు.
ALSO READ:డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి తెలియని 7 సూపర్ సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే డీమార్ట్‌లో డబ్బులు ఆదా..
పండితులు, వాస్తు నిపుణులు ఏం ఏమంటున్నారు?
“ఇంటి మీద రావి చెట్టు పెరిగితే ఆ ఇంట్లో నివసించడం, అద్దెకు తీసుకోవడం కూడా చాలా హానికరం. ఆ ఇంటి యజమాని కూడా ఎంత కష్టపడినా సంపద నిలవదు, ఎప్పుడూ ఆర్థిక సంక్షోభంలోనే ఉంటాడు” అంటున్నారు పలువురు వాస్తు నిపుణులు.ఇలాంటి ఇళ్లలో అద్దెకు ఉండే వాళ్లకు కూడా ఆ దోషం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ALSO READ:నెలకు కేవలం ₹3,500తో లక్షాధికారి కావొచ్చు.. ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ స్కీమ్..
ఏం చేయాలి?
వెంటనే ఆ రావి మొక్కలను తొలగించాలి. కానీ సాధారణంగా తీయకూడదు.శనివారం లేదా అమావాస్య రోజున అనుభవం ఉన్న పూజారి లేదా వాస్తు నిపుణుడు పిలిచి, రావి చెట్టుకు శాంతి పూజ చేయించి, దాన్ని సున్నితంగా తొలగించాలి.తీసిన తర్వాత ఆ చోట గోమూత్రం, గంగాజలం చల్లి, శుద్ధి చేయాలి.ఆ తర్వాత మళ్లీ పెరగకుండా ఉండేందుకు రాగి లేదా ఇనుప కడ్డీని ఆ స్థలంలో పూడ్చిపెట్టాలని కొందరు సూచిస్తారు.

రావి చెట్టు ఎంత పవిత్రమైనదైనా, ఇంటి నిర్మాణానికి హాని కలిగించే చోట పెరగనివ్వకూడదు. అలా పెరిగితే వెంటనే సరిచేసుకోవడమే మంచిది – లేకపోతే జీవితంలో అనేక అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/