Beauty Tips

ఒక చెంచా పొడి ఉంటే చాలు… జుట్టు రాలకుండా ఎప్పటికీ నల్లగా, మెరిసేలా ఉంటుంది..

Hair Fall Tips:ఒక చెంచా పొడి ఉంటే చాలు… జుట్టు రాలకుండా ఎప్పటికీ నల్లగా, మెరిసేలా ఉంటుంది.. చలికాలంలో జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు చాలా మందిని బాధిస్తున్నాయి. మార్కెట్‌లో ఉన్న ఖరీదైన షాంపూలు, ప్రొడక్ట్స్ ఎన్ని వాడినా శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. అయితే, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఒక హెర్బల్ షాంపూ ఈ సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది. దీనికి ముఖ్య పదార్థం – సాధారణ టీ పొడి!

ఈ సహజమైన రెమెడీ జుట్టును బలపరుస్తుంది, రాలడాన్ని అరికడుతుంది, చుండ్రును తొలగిస్తుంది. అంతేకాకుండా, జుట్టుకు సహజ మెరుపు, నలుపు నిచ్చి మృదువుగా మారుస్తుంది.

కావాల్సిన పదార్థాలు:
టీ పొడి (బ్లాక్ టీ) – 1 టేబుల్ స్పూన్
మెంతులు (మెథి సీడ్స్) – 1 టీస్పూన్
బియ్యం (ఏదైనా) – 2 టీస్పూన్లు
కరివేపాకు – ఒక చెంత (కొన్ని రెబ్బలు)
సాధారణ షాంపూ (మైల్డ్, రూపాయి షాంపూ కూడా సరిపోతుంది) – కాస్తా
నీరు – 200 ml
ALSO READ:రూ.2,999 విలువ గలది కేవలం రూ.825కే.. 72 శాతం తగ్గింపుతో..
తయారీ విధానం:
స్టవ్ మీద పాన్ పెట్టి, 200 ml నీటిని వేడి చేయండి.నీటిలో టీ పొడి, మెంతులు, బియ్యం, కరివేపాకు, కాస్తా షాంపూ వేసి బాగా మరిగించండి (5-10 నిమిషాలు).మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.ఫిల్టర్ చేసి లిక్విడ్‌ను ఒక బాటిల్‌లో స్టోర్ చేయండి. మీ హెర్బల్ షాంపూ రెడీ!

ఎలా వాడాలి?
ఈ లిక్విడ్‌ను గోరువెచ్చగా చేసుకుని, సాధారణ షాంపూలా తలస్నానం చేయండి.జుట్టు బాగా తడిసి, స్కాల్ప్‌లో మసాజ్ చేసి 5-10 నిమిషాలు ఉంచండి.సాధారణ నీటితో కడిగేయండి.వారానికి 2-3 సార్లు వాడండి. క్రమం తప్పకుండా పాటిస్తే 2-4 వారాల్లోనే మార్పు కనిపిస్తుంది.

ఈ హెర్బల్ షాంపూలోని ప్రయోజనాలు:
టీ పొడి: యాంటీఆక్సిడెంట్లు, కెఫీన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, సహజ నలుపు-మెరుపు ఇస్తుంది, తెల్లజుట్టు రాకుండా ఆలస్యం చేస్తుంది.
మెంతులు: ప్రోటీన్, ఐరన్ సమృద్ధిగా ఉండి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, చుండ్రును తొలగిస్తాయి.
బియ్యం: జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది, బలహీనతను తగ్గిస్తుంది.
కరివేపాకు: బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లతో తెల్లజుట్టును నివారిస్తుంది, జుట్టును నల్లగా, దృఢంగా మారుస్తుంది.
ALSO READ:రూ.4,999 విలువ గలది కేవలం రూ.749కే.. 85 శాతం తగ్గింపుతో..
జాగ్రత్తలు:
చలికాలంలో ఎక్కువ నూనె రాయడం మానండి – ఫంగస్, చుండ్రు పెరిగే అవకాశం ఉంది.నూనె రాస్తే గోరువెచ్చగా చేసుకుని సరైన మోతాదులో వాడండి.ఈ రెమెడీ సహజమైనది, కానీ తీవ్రమైన జుట్టు సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/