Beauty Tips

Face Glow Tips:మిగిలిన సబ్బు ముక్కలను వృథా చేయకుండా… ఇలా చేస్తే నల్లని మచ్చలు మాయం

Orange peel Face Glow Tips:మిగిలిన సబ్బు ముక్కలను వృథా చేయకుండా.. సన్ టాన్, ఓపెన్ పోర్స్, మచ్చలు తొలగించే సహజసిద్ధమైన హోమ్‌మేడ్ సోప్..మన ఇంట్లో వాడిన సబ్బు ముక్కలు చాలాసార్లు పడేసేస్తాం. కానీ వాటిని ఉపయోగించి సహజ పదార్థాలతో కలిపి ఒక అద్భుతమైన సోప్ తయారు చేసుకోవచ్చు.

ఇది సన్ టాన్ తొలగించడమే కాకుండా, ఓపెన్ పోర్స్‌ను మూసివేసి, మచ్చలు తగ్గించి, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. మార్కెట్ ప్రొడక్ట్స్‌పై ఆధారపడాల్సిన పని లేదు – ఇంట్లోనే దొరికే వస్తువులతో సులభంగా చేసుకోవచ్చు.
ALSO READ:మందార,కలబందతో కలిపి ఆ ఒక్క పనిచేస్తే.. మీ జుట్టు అస్సలు రాలదు..
కావాల్సిన పదార్థాలు:
మూడు కమలపండు (ఆరెంజ్) తొక్కలు
ఒక నిమ్మకాయ
అర కప్పు పాలు
మిగిలిన సబ్బు ముక్కలు (ఏవైనా సబ్బులు)
ఒక స్పూన్ బాదం నూనె

తయారీ విధానం:
మూడు కమలపండు తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేయండి. కమల తొక్కలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల సన్ టాన్ తొలగి, చర్మం బ్రైట్ అవుతుంది.ఒక నిమ్మకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్
మచ్చలు, మొటిమలు తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిలో ఈ తొక్కలు, నిమ్మ ముక్కలు వేసి 5-7 నిమిషాలు మరిగించండి.మరిగిన ముక్కలను మిక్సీలో వేసి, అర కప్పు పాలు పోసి మెత్తని పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను వడకట్టి రసం తీసుకోండి.ఈ రసంలో సబ్బు ముక్కలను తురుము వేసి, స్టవ్ మీద పెట్టి సబ్బు పూర్తిగా కరిగే వరకు కలుపుతూ వేడి చేయండి. సబ్బు కరిగాక స్టవ్ ఆఫ్ చేయండి.
ALSO READ:ఈ సీజ‌న్‌లో విడిచిపెట్ట‌కుండా తినాల్సిన ఆకు కూర ఇది.. క‌నిపిస్తే అసలువ‌ద‌ల‌కండి.
మిశ్రమం చల్లారాక ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపండి. బాదం నూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా చేస్తుంది.ఈ మిశ్రమాన్ని ఒక సీసా లేదా గాజు జార్‌లో పోసి నిల్వ చేయండి. ఫ్రిజ్‌లో పెడితే వారం రోజుల వరకు ఉపయోగించవచ్చు.

ఎలా వాడాలి?
ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఈ సోప్‌ను ఉపయోగించండి. ముఖం, మెడ, చేతులపై మెల్లగా మసాజ్ చేసి కడిగేయండి. కేవలం వారం రోజుల్లోనే సన్ టాన్ తగ్గి, ఓపెన్ పోర్స్ మూసుకుపోయి, మచ్చలు ఫేడ్ అయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: నిమ్మ, కమల తొక్కలు సిట్రస్ కావటం వల్ల కొందరిలో చర్మం సున్నితంగా ఉంటే ఇర్రిటేషన్ రావచ్చు. ముందుగా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సూర్యరశ్మి ఎక్కువగా పడే సమయంలో బయటకు వెళ్తుంటే సన్‌స్క్రీన్ తప్పనిసరి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/