Devotional

Vaikunta Ekadashi 2025:ముక్కోటి ఏకాదశి రేపు.. 7 ముఖ్య నియమాలు పాటించండి, విష్ణు అనుగ్రహం పొందండి!

Vaikunta Ekadashi 2025:ముక్కోటి ఏకాదశి రేపు.. 7 ముఖ్య నియమాలు పాటించండి, విష్ణు అనుగ్రహం పొందండి… ముల్లోకాలను పాలిస్తున్న శ్రీ మహావిష్ణువుని ఆరాధించే భక్తులకు మోక్ష ప్రాప్తి కలిగించే పవిత్రమైన వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) ఈసారి డిసెంబరు 30, 2025న జరుపుకోవడం జరుగుతుంది.

వైష్ణవ ఆలయాల్లో ఈ రోజు ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) తెరిచి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఈ రోజు ఉపవాసం, పూజ, జాగరణ చేస్తే పుణ్యఫలం అపారంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.భక్తులు లక్ష్మీ సమేత మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే పాప విమోచనం, మోక్షం సిద్ధిస్తాయని గట్టి విశ్వాసం.

వైకుంఠ ఏకాదశి వ్రత నియమాలు:
దశమి రాత్రి నుంచి ఉపవాసం ప్రారంభించాలి.
ఏకాదశి పూర్తి రోజు నిరాహార ఉపవాసం లేదా ఫలాహారం ఆచరించాలి.
అబద్ధాలు, చెడు ఆలోచనలు, దుష్కార్యాలు మానాలి.
బ్రహ్మచర్యం పాటించాలి.
రాత్రి జాగరణ చేసి గోవింద నామ స్మరణ, భగవద్గీత పారాయణం, పురాణ శ్రవణం చేయాలి.
అన్నదానం, దానధర్మాలు చేయడం శ్రేష్ఠం.

ద్వాదశి రోజు భగవంతుని ఆరాధన ముగించి, బ్రాహ్మణులకు దక్షిణ-తాంబూలాలు ఇచ్చి పారణ చేయాలి. అతిథి లేకుండా భోజనం చేయరాదు.ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు, నెయ్యి, నువ్వులు వంటివి సేవించవచ్చు.గో సేవ, విష్ణు పూజ, “ఓం నమో నారాయణాయ” మంత్ర జపం (108 సార్లు) చేస్తే అన్ని కార్యాలు సిద్ధిస్తాయి.

శాస్త్రాల ప్రకారం మన శరీరమే విష్ణు ఆలయం. హృదయంలో పరమాత్మ జ్యోతిగా వెలుగొందుతాడు. ఏకాదశి వ్రతం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహించి, ధ్యాన-జప-పూజలు చేయడం వల్ల గోవిందుని ఆశీర్వాదం లభిస్తుంది.

ఉపవాసం శరీరానికి విశ్రాంతినిచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఆధ్యాత్మిక సాధనకు సహకరిస్తుంది.ఈ పవిత్ర ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు భక్తులందరికీ మంగళాలు ప్రసాదించాలని ప్రార్థన.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/