Devotional

Tirumala Tirupati:శ్రీవారి ఆలయంలో 2026 జనవరి నెల విశేష పర్వదినాలు – తేదీలతో కూడిన లిస్ట్!

Tirumala Tirupati:శ్రీవారి ఆలయంలో 2026 జనవరి నెల విశేష పర్వదినాలు – తేదీలతో కూడిన లిస్ట్… తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా ప్రకటించిన 2026 జనవరి నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి:

జనవరి 4: తిరుమల శ్రీవారి ప్రణయ కలహోత్సవం
జనవరి 8: శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర
జనవరి 12: శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల సమాప్తి
జనవరి 13: తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు
జనవరి 14: భోగి పండుగ
జనవరి 15: మకర సంక్రాంతి – సుప్రభాతసేవ పునఃప్రారంభం
జనవరి 16: కనుమ పండుగ – తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు
జనవరి 18: పురందరదాసుల ఆరాధన మహోత్సవం
జనవరి 23: వసంత పంచమి
జనవరి 25: రథసప్తమి

ఈ విశేష దినాల్లో భక్తులు తిరుమలలో ప్రత్యేక సేవలు, ఉత్సవాలు చూసే అవకాశం ఉంటుంది. ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో దర్శనం, సేవల కోటా బుక్ చేసుకోవడం మంచిది. శ్రీ వెంకటేశ్వరుని కృపాకటాక్షం సర్వదా కలగాలని కోరుకుంటూ… గోవిందా! గోవిందా!