Home Tips:ఇంటి గడప ముందు చెప్పులు తిరగబడి ఉంటే ఏం జరుగుతుంది?
Home Tips:ఇంటి గడప ముందు చెప్పులు తిరగబడి ఉంటే ఏం జరుగుతుంది.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు సానుకూల లేదా ప్రతికూల శక్తులను ప్రసరింపజేస్తుంది. అందుకే వస్తువులను సరైన స్థానంలో, సరైన రీతిలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు నియమాలను అనుసరించకపోతే జీవితంపై చెడు ప్రభావం పడుతుందని నమ్మకం. ముఖ్యంగా బూట్లు, చెప్పులు సరిగ్గా ఉంచకపోతే ఇంటి సభ్యులకు కొన్ని సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం, చెప్పులు లేదా బూట్లను తలకిందులుగా లేదా పక్కకు తిప్పి ఉంచితే లక్ష్మీదేవి కోపం తెచ్చుకుంటుంది. ఆమె ఇంట్లో నివసించడానికి ఇష్టపడదు. ఫలితంగా ఇంట్లో ఆర్థిక నష్టాలు, పేదరికం పెరుగుతాయి. అందుకే చెప్పులను ఎప్పుడూ ఇంటి లోపల ఉంచకూడదు, ముఖ్యంగా తలకిందులుగా కాకుండా సరిగ్గా అమర్చాలి. ఇప్పుడు దీని వెనుక ఉన్న కారణాలను వివరంగా తెలుసుకుందాం.
ALSO READ:గోర్లు కత్తిరించడం ఏ రోజుల్లో మంచిది? ఏ రోజుల్లో చేయకూడదు?
గ్రహ దోషాలు పెరుగుతాయి
చెప్పులు లేదా బూట్లను తలకిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో గ్రహాల ప్రతికూల ప్రభావం పెరుగుతుందని జ్యోతిష్య, వాస్తు నిపుణులు అంటున్నారు. లక్ష్మీదేవి కూడా ఆగ్రహానికి గురై, ఇంటిని విడిచి వెళ్లిపోతుందని నమ్మకం. దీంతో ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నష్టాలు తప్పవు.
అనారోగ్య సమస్యలు వస్తాయి
ఇంటి ద్వారం వద్ద చెప్పులు తలకిందులుగా ఉంటే, అది కుటుంబ సభ్యుల మనస్తత్వంపై చెడు ప్రభావం చూపుతుంది. దీంతో ఇంట్లో అనారోగ్యాలు, మానసిక బాధలు పెరిగిపోతాయి. అందుకే తలకిందులుగా కనిపిస్తే వెంటనే సరిచేయాలి.
ప్రతికూల శక్తి పెరుగుతుంది
చెప్పులు తలకిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి తగ్గి, ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది కుటుంబ శాంతి, ఆనందాన్ని దెబ్బతీస్తుంది.
ALSO READ:సంక్రాంతి పండుగ… మీ రాశి ప్రకారం ఏ వస్తువులు దానం చేయాలి?
ఇంటి ముందు చెప్పులు ఎల్లప్పుడూ నీట్‌గా, సరైన స్థితిలో ఉండాలి. చెల్లాచెదురుగా లేదా తలకిందులుగా పడేస్తే చూడడానికే బాగోదు. అంతేకాకుండా, ఇంటికి వచ్చే అతిథులకు మొదట చెడు భావన కలిగిస్తుంది. కానీ నీట్‌గా జతగా అమర్చి ఉంచితే సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.
వాస్తు టిప్: చెప్పుల ర్యాక్‌ను పశ్చిమ లేదా నైరుతి దిశలో ఉంచండి. ఈశాన్యం, ఉత్తర దిశల్లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమృద్ధి, శాంతి నెలకొంటాయి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

