Power Bill:ఏపీ ప్రజలకు పండగే పండగ.. చంద్రబాబు అదిరిపోయే ‘సంక్రాంతి గిఫ్ట్’! కరెంట్ బిల్లుల మోత ఇక ఉండదు..
Power Bill:ఏపీ ప్రజలకు పండగే పండగ.. చంద్రబాబు అదిరిపోయే ‘సంక్రాంతి గిఫ్ట్’! కరెంట్ బిల్లుల మోత ఇక ఉండదు..సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ శుభవార్త చెప్పారు. గత కొన్నేళ్లుగా కరెంట్ బిల్లుల మోతతో బెంబేలెత్తుతున్న సామాన్యులకు ఊరటనిస్తూ.. “సంక్రాంతి గిఫ్ట్” (Sankranti Gift) ప్రకటించారు.
ఆ వివరాలు ఇవే:
1. ట్రూ-అప్ ఛార్జీల బాదుడు రద్దు: ప్రజలు భయపడేది ట్రూ-అప్ (True-up) ఛార్జీలకే. అయితే, 2019–24 కాలానికి సంబంధించిన సుమారు రూ.4,498 కోట్ల భారాన్ని ప్రజలపై వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల యూనిట్‌పై ప్రజలకు 13 నుండి 29 పైసల వరకు ఆదా అవుతుంది.
2. మార్చి కల్లా మరో గుడ్ న్యూస్: ఇప్పటికే యూనిట్ ధరను రూ.5.19 నుంచి రూ.4.90కి తగ్గించామని సీఎం తెలిపారు. రాబోయే మార్చి నాటికి యూనిట్‌పై మరో 10 పైసలు తగ్గించనున్నారు.
ALSO READ:రూ.5 లక్షల ఉచిత వైద్యం.. మీ ఫోన్‌లోనే ‘ఆయుష్మాన్ కార్డ్’! ఎక్కడికీ వెళ్లొద్దు.. 2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండిలా.
3. రూ.4 కే యూనిట్ విద్యుత్: భవిష్యత్తులో ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. రాబోయే మూడేళ్లలో యూనిట్ ధరను కేవలం రూ.4 కే అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
4. ఎవరెవరికి లాభం? ఈ నిర్ణయం వల్ల సామాన్య గృహ వినియోగదారులతో పాటు, చిన్న వ్యాపారులు, పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరనుంది. అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
మొత్తానికి పండుగ వేళ ఈ ప్రకటన ఏపీ ప్రజలకు నిజంగానే పెద్ద ఊరట!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

