Business

YouTube Channel Views:కష్టపడి వీడియోలు చేస్తున్నా వ్యూస్ రావట్లేదా? అల్గారిథమ్ ఏం కోరుకుంటోంది? కొత్త సీక్రెట్స్ ఇవే…

YouTube Channel Views:కష్టపడి వీడియోలు చేస్తున్నా వ్యూస్ రావట్లేదా? అల్గారిథమ్ ఏం కోరుకుంటోంది? కొత్త సీక్రెట్స్ ఇవే.రోజులు మారుతున్నాయి.. యూట్యూబ్ కూడా మారుతోంది. 2026లో పాత పద్ధతులు అస్సలు పనిచేయవు. ఎంత కష్టపడి వీడియో చేసినా 100, 200 వ్యూస్ దగ్గరే ఆగిపోతోందా? అయితే మీరు యూట్యూబ్ అల్గారిథమ్‌ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.

లక్ (Luck) మీద కాకుండా.. ‘స్మార్ట్ వర్క్’ మీద ఫోకస్ చేస్తే మీ ఛానెల్ మళ్లీ గాడిలో పడుతుంది. దానికి ఈ 5 టిప్స్ పాటించండి:

1. మీ కోసం కాదు.. జనం కోసం చేయండి: చాలామంది తమకు నచ్చిన వీడియోలు చేస్తారు. కానీ 2026లో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో (Search Intent) అది మాత్రమే యూట్యూబ్ రికమండ్ చేస్తుంది.మీ ఆడియన్స్ ఎలాంటి ప్రశ్నలు వెతుకుతున్నారు? వారి సమస్యలేంటి?వారికి పరిష్కారం చూపించే వీడియోలు చేస్తే.. ఆటోమేటిక్‌గా వాచ్ టైమ్ పెరుగుతుంది.

2. మొదటి 10 సెకన్లే మీ భవిష్యత్తు: వీడియో ఓపెన్ చేయగానే “హాయ్ ఫ్రెండ్స్.. వెల్ కమ్ టు..” అంటూ సోది చెప్తే జనం వెంటనే స్కిప్ కొడతారు.వీడియోలో మొదటి 10 సెకన్లు చాలా కీలకం.వీడియోలో ఏం చెప్పబోతున్నారో సూటిగా, ఒక హుక్ (Hook) పాయింట్‌తో మొదలుపెట్టండి. క్యూరియాసిటీ ఉంటేనే చివరి వరకు చూస్తారు.
ALSO READ:చిప్స్ ప్యాకెట్ సగం తిని వదిలేశారా? రబ్బర్ బ్యాండ్లు అక్కర్లేదు.. ఇలా చేస్తే నెల రోజులైనా కరకరలాడతాయి!
3. థంబ్ నెయిల్ ‘అందంగా’ ఉంటే సరిపోదు: థంబ్ నెయిల్ చూడగానే క్లిక్ చేయాలి అనే ఆసక్తి కలగాలి.టైటిల్‌లో సగం కథ చెప్పి, మిగతా సగం సస్పెన్స్‌గా ఉంచాలి.అనవసరమైన టెక్స్ట్, క్లిక్‌ బైట్ (Clickbait) పెట్టకండి. సింపుల్ విజువల్స్, ఎమోషన్ ఉంటే జనం క్లిక్ చేస్తారు.

4. AI వాడుకోండి.. కానీ ‘హ్యూమన్ టచ్’ ఉండాలి: ఇప్పుడు అందరూ AIతో స్క్రిప్ట్స్, ఎడిటింగ్ చేస్తున్నారు. కానీ ఆడియన్స్ కోరుకునేది మీ ‘ఒరిజినాలిటీ’ (Authenticity).AIని సపోర్ట్‌గా మాత్రమే తీసుకోండి.మీ గొంతులో, మాటల్లో నిజాయితీ, ఎమోషన్ ఉంటేనే సబ్ స్క్రైబర్లు మీతో కనెక్ట్ అవుతారు.

5. అల్గారిథమ్‌కి ‘టైమ్’ సెన్స్ ఎక్కువ: ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు పెడితే అల్గారిథమ్ కన్ఫ్యూజ్ అవుతుంది.ఒక టైమ్, ఒక రోజు ఫిక్స్ చేసుకోండి. వారానికి రెండు వీడియోలా? మూడు వీడియోలా? అని ముందే డిసైడ్ అవ్వండి.మీరు కన్సిస్టెంట్‌గా ఉంటేనే యూట్యూబ్ మీ వీడియోలను కొత్తవారికి చూపిస్తుంది.

వ్యూస్ నెంబర్ల వైపు చూడకండి.. ప్రతి వీడియోకి క్వాలిటీ పెంచుకుంటూ వెళ్లండి.. సక్సెస్ అదే వస్తుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/