White Hair:ఇంకెన్నాళ్లు ఆ కెమికల్ రంగులు? వారానికి ఒక్కసారి ఇలా చేస్తే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లబడుతుంది!
White Hair:ఇంకెన్నాళ్లు ఆ కెమికల్ రంగులు? వారానికి ఒక్కసారి ఇలా చేస్తే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లబడుతుంది.. వయసు 30 కూడా రాకముందే జుట్టు తెల్లబడిపోతోందా? ఆ నలుపు రంగు కోసం మార్కెట్లో దొరికే హెయిర్ డై (Hair Dye) వాడుతున్నారా? అయితే మీరు మీ జుట్టును మీ చేతులారా పాడుచేసుకుంటున్నట్టే!
కెమికల్స్ వాడి జుట్టు రాలిపోయేలా చేసుకోవడం కంటే.. ఆయుర్వేద డాక్టర్లు సూచించిన ఈ “న్యాచురల్ పేస్ట్” ఒక్కసారి ట్రై చేయండి. కేవలం వంటింటి చిట్కాలతోనే మీ కురులు నల్లగా, ఒత్తుగా మారతాయి.
కావాల్సిన పదార్థాలు (Natural Ingredients).. ఈ చిట్కా కోసం మనకు కావాల్సినవి అన్నీ సహజసిద్ధమైనవే. వీటి వల్ల జుట్టుకు రంగుతో పాటు బలం కూడా వస్తుంది.
హెన్నా పొడి (Henna): 1 కప్పు
కాఫీ పొడి (Coffee Powder): 1 టీస్పూన్ (రంగు కోసం)
కుంకుడుకాయల పొడి: 1 స్పూన్
మెంతులు: 1 టీస్పూన్
ఉసిరి & బ్రాహ్మీ పొడి: ఒక్కో టీస్పూన్ (జుట్టు బలానికి)
పెరుగు: పేస్ట్ కలపడానికి సరిపడా
ALSO READ:వేల పెట్టి ఆయిల్స్ కొనకండి.. రోజూ ఈ 5 డ్రింక్స్ తాగితే జుట్టు నేలకి ఆనుతుంది!
తయారీ విధానం (How to Prepare)
పైన చెప్పిన పొడులన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.ఇప్పుడు అందులో సరిపడా పెరుగు (Curd) వేసి, ఉండలు లేకుండా పేస్టులా కలపాలి. (నీళ్లు వాడొద్దు). ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెడితే ఇంకా మంచిది, లేదా కనీసం ఒక గంట పక్కన పెట్టండి.
ఎలా వాడాలి?
ఈ పేస్టును జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.సుమారు ఒక గంట పాటు ఆరనివ్వాలి.చివరగా.. షాంపూ అస్సలు వాడకుండా, కేవలం సాధారణ నీటితో తలస్నానం చేయాలి.
టిప్: వారానికి ఒకసారి ఇలా చేస్తే.. హెన్నా మరియు కాఫీ కలయిక వల్ల జుట్టుకు మంచి ముదురు రంగు (Dark Color) వస్తుంది. ఉసిరి, మెంతుల వల్ల జుట్టు రాలడం ఆగిపోయి పట్టులా మెరుస్తుంది.
ఇది కూడా గుర్తుంచుకోండి..కేవలం పై పూతలే కాదు, లోపలికి తీసుకునే ఆహారం కూడా ముఖ్యమే.
నీళ్లు: రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
ఆహారం: కరివేపాకు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి (Iron & Vitamin B12 కోసం).
ఒత్తిడి: టెన్షన్ పడితే జుట్టు త్వరగా మెరుస్తుంది. కాబట్టి ప్రశాంతమైన నిద్ర అవసరం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

