Business

Sukanya Samriddhi Yojana:మీకు కూతురు ఉందా? అయితే కేంద్రం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ మీకోసమే.. చేతికి ఏకంగా రూ.72 లక్షలు..

Sukanya Samriddhi Yojana:మీకు కూతురు ఉందా? అయితే కేంద్రం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ మీకోసమే.. చేతికి ఏకంగా రూ.72 లక్షలు.. ప్రతి తండ్రికి తన కూతురంటే ప్రాణం. ఆమెను ఉన్నత చదువులు చదివించాలి, ఘనంగా పెళ్లి చేయాలని ఎన్నో కలలు కంటారు. కానీ, నేటి సమాజంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఆ కలలు నెరవేర్చడానికి గట్టి ఆర్థిక భరోసా అవసరం.

సరిగ్గా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలుస్తోంది. మీ అమ్మాయి భవిష్యత్తు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం ‘సుకన్య సమృద్ధి యోజన’ (SSY). కేవలం పొదుపు మాత్రమే కాదు, మీ కూతురి భవిష్యత్తుకు కోట్ల ఆస్తిని కూడబెట్టే అవకాశం ఇది. ఇందులో చేరితే పాప పెద్దయ్యే సరికి ఏకంగా రూ. 72 లక్షలు మీ చేతికి అందుతాయి. నమ్మశక్యంగా లేదు కదూ! ఈ లెక్క చూడండి మీకే అర్థమవుతుంది.

రూ.72 లక్షలు ఎలా వస్తాయంటే?
‘బేటీ బచావో – బేటీ పడావో’ లో భాగంగా వచ్చిన ఈ స్కీమ్‌లో చక్రవడ్డీ (Compound Interest) మ్యాజిక్ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ పథకానికి అత్యధికంగా 8.20 శాతం వడ్డీ రేటు ఉంది.
ALSO READ:నల్లుల బెడదతో విసిగిపోయారా? ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి..
మీరు ప్రతి ఏటా పొదుపు చేయాల్సింది: రూ.1,50,000
మీరు డబ్బు కట్టాల్సిన కాలం: 15 ఏళ్లు
ఈ 15 ఏళ్లలో మీరు జమ చేసే మొత్తం: రూ.22,50,000
వడ్డీ రూపంలో మీకు వచ్చే లాభం: రూ.49,32,119
మెచ్యూరిటీ (21 ఏళ్ల తర్వాత) చేతికొచ్చే మొత్తం: రూ. 71,82,119 (సుమారు రూ.72 లక్షలు)

ఒక చిన్న సీక్రెట్: మీరు ఈ పూర్తి మొత్తాన్ని (రూ.71.8 లక్షలు) పొందాలంటే.. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి 5వ తేదీ లోపు డబ్బు డిపాజిట్ చేయడం మరిచిపోవద్దు. ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం మొత్తానికి గరిష్ట వడ్డీని పొందవచ్చు.

ఈ పథకం ఎందుకు బెస్ట్?
100% గ్యారంటీ: ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. కాబట్టి మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది, రిస్క్ సున్నా.
అధిక వడ్డీ: ప్రస్తుతం ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నింటిలో కెల్లా అత్యధిక వడ్డీ (8.20%) దీనికే ఇస్తున్నారు.
పన్ను మినహాయింపు: సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.

ముఖ్యమైన నియమాలు:
పుట్టిన పాప నుండి 10 ఏళ్ల లోపు వయసున్న ఆడపిల్లల పేరు మీద ఎప్పుడైనా ఈ ఖాతా తెరవవచ్చు.

ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.ఖాతా తెరిచినప్పటి నుండి 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బు డ్రా చేసుకోవచ్చు. అయితే, పాపకు 18 ఏళ్లు నిండాక ఉన్నత చదువుల కోసం 50 శాతం సొమ్మును తీసుకునే వెసులుబాటు ఉంది.

మీ అమ్మాయి బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే ఆలోచించండి. దగ్గరలోని బ్యాంకు లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/