Business

Solar System: 3kW సోలార్ ప్యానెల్: ఒక్కసారి పెడితే కరెంట్ బిల్లు ‘జీరో’.. ఎన్ని ACలు నడపవచ్చు? సబ్సిడీ ఎంత?

Solar System: 3kW సోలార్ ప్యానెల్: ఒక్కసారి పెడితే కరెంట్ బిల్లు ‘జీరో’.. ఎన్ని ACలు నడపవచ్చు? సబ్సిడీ ఎంత..పెరుగుతున్న కరెంట్ బిల్లులతో బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు ‘సోలార్ పవర్’ ఒక వరంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లకు 3kW సోలార్ సిస్టమ్ అత్యంత పొదుపైన మార్గంగా నిలుస్తోంది. అసలు ఈ 3kW ప్యానెల్స్‌తో ఇంట్లో ఏయే వస్తువులు నడపవచ్చు? ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంత? పూర్తి వివరాలు మీకోసం..

రోజుకు ఎన్ని యూనిట్ల విద్యుత్తు వస్తుంది?
భారతదేశ వాతావరణ పరిస్థితుల ప్రకారం, 1kW సోలార్ సిస్టమ్ రోజుకు సగటున 4 నుండి 5 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అంటే 3kW సిస్టమ్ ద్వారా మీరు రోజుకు 12 నుండి 15 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను పొందవచ్చు. నెలకు సుమారు 360 – 450 యూనిట్ల వరకు ఆదా చేసుకోవచ్చు.

3kW సోలార్‌తో ఏయే ఉపకరణాలు నడపవచ్చు?
చాలామందికి ఉండే సందేహం.. సోలార్‌పై ఏసీలు (AC) నడుస్తాయా? అని. నిస్సందేహంగా నడుస్తాయి!

1 టన్ను AC అయితే: మీరు ఒకేసారి 2 ఏసీలను సులభంగా నడపవచ్చు. వీటితో పాటు 4-5 LED లైట్లు, 2 ఫ్యాన్లు, టీవీ మరియు ఫ్రిజ్ వాడుకోవచ్చు.
1.5 టన్ను AC అయితే: ఒక ఏసీని నడుపుతూ, దాంతో పాటు కూలర్, ఫ్యాన్లు, లైట్లు మరియు టీవీని ఎటువంటి ఆటంకం లేకుండా వాడుకోవచ్చు.
ALSO READ:మీకు కూతురు ఉందా? అయితే కేంద్రం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ మీకోసమే.. చేతికి ఏకంగా రూ.72 లక్షలు..
ఖర్చు ఎంత? సబ్సిడీ ఎంత వస్తుంది?
టాటా వంటి కంపెనీల 3kW ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్ ధర మార్కెట్‌లో సుమారు రూ. 1.80 లక్షల వరకు ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం’ ద్వారా మీకు భారీ ఉపశమనం లభిస్తుంది.

ప్రభుత్వ సబ్సిడీ: సుమారు రూ. 78,000.
మీరు చెల్లించాల్సిన నికర ధర: సబ్సిడీ పోను కేవలం రూ. 1 లక్ష లోపే ఈ సిస్టమ్ మీ ఇంటిపై కొలువు తీరుతుంది.

సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
నమోదు: ముందుగా pmsuryaghar.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

సర్వే: దరఖాస్తు తర్వాత విద్యుత్ శాఖ (DISCOM) అధికారులు మీ ఇంటిని సర్వే చేసి అనుమతి ఇస్తారు.

ఇన్‌స్టాలేషన్: అనుమతి రాగానే అధీకృత వెండర్ ద్వారా ప్యానెల్స్ అమర్చుకోవాలి.

సబ్సిడీ జమ: నెట్ మీటరింగ్ ప్రక్రియ పూర్తయిన 30 రోజుల్లోపు సబ్సిడీ సొమ్ము నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

ప్రయోజనం: ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్తును పొందవచ్చు. అంటే మీ పెట్టుబడి కేవలం 3-4 ఏళ్లలోనే కరెంట్ బిల్లుల రూపంలో వెనక్కి వచ్చేస్తుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/