Tech Tip: ఆధార్ కార్డు పోయిందా? టెన్షన్ వద్దు.. ఇంట్లో కూర్చునే ఒరిజినల్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా!
Tech Tip: ఆధార్ కార్డు పోయిందా? టెన్షన్ వద్దు.. ఇంట్లో కూర్చునే ఒరిజినల్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా.. బ్యాంకు ఖాతా నుంచి సిమ్ కార్డు వరకు.. రేషన్ నుంచి పెన్షన్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డే ఆధారం. అలాంటిది జేబులో పర్సుతో పాటు ఆధార్ కార్డు పోతే? పోనీ పోయింది కదా అని కొత్తది తీసుకుందాం అంటే ‘ఆధార్ నంబర్’ కూడా గుర్తులేకపోతే? అస్సలు కంగారు పడకండి. మీ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. చిటికెలో మీ ఆధార్ మీ చేతికి వస్తుంది.
1. ఆధార్ నంబర్ కూడా తెలియకపోతే ఏం చేయాలి? మీకు ఆధార్ నంబర్ గుర్తులేకపోతే UIDAI వెబ్‌సైట్‌లో చిన్న పని చేయాలి.UIDAI వెబ్‌సైట్‌కి వెళ్ళి “Retrieve Lost or Forgotten EID/UID” ఆప్షన్ ఎంచుకోండి.
మీ పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.ఫోన్‌కు వచ్చే OTP ఎంటర్ చేయగానే.. మీ ఆధార్ నంబర్ SMS రూపంలో మీ ఫోన్‌కు వచ్చేస్తుంది.
2. ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా: నెంబర్ వచ్చాక, వెబ్‌సైట్‌లో “Download Aadhaar” క్లిక్ చేసి, నంబర్, OTP ఎంటర్ చేస్తే PDF ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.
ముఖ్య గమనిక (Password): ఈ PDF ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ కావాలి. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు (Capital Letters) + మీ పుట్టిన సంవత్సరం (Year) కలిపి కొడితేనే ఓపెన్ అవుతుంది.
ఉదాహరణకు: పేరు SURESH, పుట్టిన సంవత్సరం 1990 అయితే.. పాస్‌వర్డ్ SURE1990.
3. మాస్క్‌డ్ ఆధార్ (Masked Aadhaar) అంటే ఏంటి? హోటల్స్, సినిమా హాళ్లు లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో ఐడీ ప్రూఫ్ అడిగినప్పుడు ఒరిజినల్ ఆధార్ ఇవ్వకండి. దానికి బదులు ‘మాస్క్‌డ్ ఆధార్’ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇందులో చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా సేఫ్‌గా ఉంటుంది.
సేఫ్టీ అలర్ట్: మీ అనుమతి లేకుండా ఎవరూ మీ ఆధార్ వాడకూడదంటే.. UIDAI సైట్‌లో “Biometric Lock” వేసుకోండి. దీనివల్ల సైబర్ నేరగాళ్లు మీ వేలిముద్రలను వాడి డబ్బులు దొంగిలించలేరు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘telugulifestyle’ బాధ్యత వహించదని గమనించగలరు.

