Beauty Tips

Hair Fall:జుట్టు విపరీతంగా రాలిపోతోందా? క్యారెట్‌తో ఇలా చేస్తే.. పట్టుకుచ్చలాంటి కురులు మీ సొంతం!

Hair Fall:జుట్టు విపరీతంగా రాలిపోతోందా? క్యారెట్‌తో ఇలా చేస్తే.. పట్టుకుచ్చలాంటి కురులు మీ సొంతం.. జుట్టు రాలడం, చివర్ల చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? ఖరీదైన షాంపూలు వాడినా ఫలితం లేదా? అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసమే.

కళ్ళకే కాదు, కేశాలకు కూడా క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్-ఎ, బయోటిన్ జుట్టును దృఢంగా మార్చుతాయి. ఆ 3 మ్యాజికల్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

1. స్మూత్ హెయిర్ కోసం.. క్యారెట్ పేస్ట్..జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే ఈ ప్యాక్ ట్రై చేయండి.
కావాల్సినవి: రెండు క్యారెట్లు.
తయారీ విధానం: రెండు క్యారెట్లను తీసుకుని మెత్తగా ఉడికించాలి. ఆ ఉడికించిన నీటితో పాటే క్యారెట్‌ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
వాడే విధానం: ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి, అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.

2. రాత్రంతా ఇలా చేస్తే.. కుదుళ్లు బలంగా మారుతాయి..జుట్టు రాలడం ఆగి, బలంగా పెరగాలంటే ఈ నైట్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్.
కావాల్సినవి: రెండు క్యారెట్ల రసం, 2 స్పూన్ల తేనె, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ విటమిన్-ఇ ఆయిల్.
తయారీ విధానం: ఒక గిన్నెలో తేనె, ఆలివ్ ఆయిల్, విటమిన్-ఇ ఆయిల్ తీసుకుని గోరువెచ్చగా వేడి చేయాలి. దీనిని ముందుగా తీసి పెట్టుకున్న క్యారెట్ రసంలో కలపాలి.
వాడే విధానం: ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. రాత్రంతా జుట్టుకు షవర్ క్యాప్ పెట్టుకుని, మరుసటి రోజు ఉదయం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టును మూలాల నుండి దృఢంగా ఉంచుతుంది.

3. మెరిసే జుట్టు కోసం.. క్యారెట్ & అరటిపండు..మీ జుట్టు డ్యామేజ్ అయ్యిందా? అయితే ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది.
కావాల్సినవి: ఒక క్యారెట్, ఒక అరటిపండు, కొంచెం ఆలివ్ ఆయిల్.
తయారీ విధానం: క్యారెట్, అరటిపండును చిన్న ముక్కలుగా కోసి, అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
వాడే విధానం: ఈ ప్యాక్‌ను జుట్టు మొత్తానికి పట్టించి, ఆరిన తర్వాత (సుమారు అరగంట) షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది.
చిట్కా: వారానికి కనీసం రెండు సార్లు ఈ ప్యాక్స్ ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/