Business

AP Eklavya Schools Admission:రూ.లక్షల విలువైన చదువు ఉచితం! హాస్టల్, ఫుడ్, యూనిఫామ్ అన్నీ ఫ్రీ.. అప్లై చేయడానికి ఇదే లాస్ట్ ఛాన్స్!

AP Eklavya Schools Admission: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? కార్పొరేట్ స్థాయి విద్యను మీ పిల్లలకు ఉచితంగా అందించాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకులాలు కల్పిస్తున్న ఈ సువర్ణావకాశం మీ కోసమే. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివించవచ్చు. ఆ వివరలేంటో చూడండి.

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) అంటే సామాన్య విషయం కాదు. విశాలమైన భవనాలు, సీబీఎస్‌ఈ (CBSE) ప్రమాణాలతో కూడిన చదువు ఇక్కడ లభిస్తుంది. ప్రస్తుతం ఏపీలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

అదిరిపోయే సౌకర్యాలు.. అన్నీ ఉచితమే!
ఈ స్కూల్‌లో సీటు వస్తే మీ పిల్లల చదువు బాధ్యత మొత్తం ప్రభుత్వానిదే.

ఎడ్యుకేషన్: 6వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్) వరకు పూర్తి ఉచితం.
మీడియం: సీబీఎస్‌ఈ (CBSE) ఇంగ్లీష్ మీడియం.
వసతి: ఉచిత హాస్టల్, రుచికరమైన భోజనం.
కిట్: పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్, షూ, టై, బెల్ట్, నైట్ డ్రెస్.
ఇతర వస్తువులు: ప్లేట్, గ్లాస్, బెడ్‌షీట్, రగ్గు, ట్రంకు పెట్టె కూడా స్కూల్ వాళ్లే ఇస్తారు.
క్యాంపస్: ఒక్కో స్కూల్ దాదాపు 30 ఎకరాల్లో, విశాలమైన గ్రౌండ్స్, ల్యాబ్స్‌తో ఉంటుంది.

ఎవరెవరు అర్హులు? సీట్లు ఎన్ని?
ఏపీ వ్యాప్తంగా మొత్తం 28 ఏకలవ్య స్కూల్స్ ఉన్నాయి. (అల్లూరి జిల్లాలోనే 11 ఉన్నాయి). మొత్తం 1680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కో-ఎడ్యుకేషన్ (Co-Ed) విధానం.

ఒక్కో క్లాస్‌కు 60 సీట్లు (బాలురు-30, బాలికలు-30).
గిరిజనులకు (ST): 48 సీట్లు.
పీవీటీజీ (PVTG): 3 సీట్లు.
అనాథ పిల్లలకు: 6 సీట్లు (ఇందులో ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరైనా అర్హులే – తల్లిదండ్రులు లేనివారు).
ఇతరులు: దివ్యాంగులు, సంచార జాతులకు 3 సీట్లు.

అర్హతలు:
ప్రస్తుతం 5వ తరగతి చదువుతుండాలి.
వయస్సు 10 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి (మార్చి 31 నాటికి).
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1 లక్ష మించకూడదు.
వైట్ రేషన్ కార్డు ఉండాలి.

ఎలా అప్లై చేయాలి?
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో https://aptwgurukulam.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. లేదా దగ్గర్లోని ఏకలవ్య స్కూల్‌కి వెళ్లి కూడా అప్లై చేయొచ్చు.
ఫీజు: కేవలం రూ. 50 మాత్రమే.
కావాల్సినవి: విద్యార్థి ఫోటో, ఆధార్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు వివరాలు.
చివరి తేదీ: ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ఎలా?
ఏప్రిల్ 4న ప్రవేశ పరీక్ష ఉంటుంది.
మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ (మెంటల్ ఎబిలిటీ-50, మ్యాథ్స్-25, తెలుగు-25).
ఇందులో మెరిట్ సాధించిన వారికి సీటు ఇస్తారు.

గమనిక: మీ పిల్లల భవిష్యత్తును మార్చే అద్భుతమైన అవకాశం ఇది. లేదా మీకు తెలిసిన పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ఈ విషయాన్ని షేర్ చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/