Business Ideas:కేవలం 4 నెలలు.. చేతికి లక్ష రూపాయలు! సమ్మర్‌లో కాసుల వర్షం కురిపించే బిజినెస్ ఇదే..
Business Ideas:కేవలం 4 నెలలు.. చేతికి లక్ష రూపాయలు! సమ్మర్‌లో కాసుల వర్షం కురిపించే బిజినెస్ ఇదే..ఎండలు మండిపోతున్నాయి.. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. కానీ, తెలివైన వారికి ఈ ఎండకాలమే డబ్బులు సంపాదించిపెట్టే ‘సీజన్’. అవును, రాబోయే 4 నెలలు మీరు కొంచెం కష్టపడితే చాలు.. జేబు నిండా డబ్బులతో సమ్మర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద చదువులు, భారీ పెట్టుబడులు అవసరం లేని ఆ బిజినెస్ ఐడియా ఏంటో చూసేయండి.
డిమాండ్ మామూలుగా ఉండదు! మరో వారం రోజుల్లో ఎండలు ముదిరిపోతాయి. బయట అడుగు పెడితే చాలు గొంతు తడారిపోతుంది. ఈ టైమ్‌లో జనం ఎక్కువగా వెతికేది చల్లని పానీయాల కోసమే. బస్టాండ్లు, మార్కెట్లు, జనసంచారం ఉన్న చోట చిన్న స్టాల్ పెడితే చాలు.. గిరాకీకి ఢోకా ఉండదు.
మెనూ సింపుల్.. ధరలు చీప్! కూల్ డ్రింక్స్ అంటే ఖరీదైనవి కాకుండా.. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
చల్లని మజ్జిగ: రూ. 10 (గ్లాస్)
నిమ్మరసం: రూ. 10 (గ్లాస్)
బాదం మిల్క్: రూ. 15 (గ్లాస్)
ఈ రేట్లు ఉంటే.. ప్రతి ఒక్కరూ తాగుతారు. రుచి, శుభ్రత పాటిస్తే ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్లీ మళ్లీ వస్తారు.
పెట్టుబడి ఎంత? దీనికి లక్షల్లో పెట్టుబడి అక్కర్లేదు.
ఒక చిన్న ఫ్రీజర్ లేదా ఐస్ బాక్స్
గ్లాసులు, గిన్నెలు
ముడి సరుకులు (పాలు, పెరుగు, నిమ్మకాయలు, పంచదార, ఐస్)
రోడ్డు పక్కన చిన్న స్టాల్ లేదా బండి. ఇంతే.. తక్కువ ఖర్చుతోనే వ్యాపారం మొదలుపెట్టొచ్చు.
లాభం లక్షల్లో ఉంటుందా? ఖచ్చితంగా! రోజుకు కనీసం 100 గ్లాసులు అమ్మినా.. ఖర్చులు పోను రోజుకు రూ. 1,000 వరకు మిగిలే అవకాశం ఉంది. ఈ లెక్కన నెలకు రూ. 30 వేల వరకు సంపాదించొచ్చు. సమ్మర్ ఉండేది 4 నెలలు కాబట్టి.. కన్సిస్టెన్సీగా చేస్తే లక్ష రూపాయలు వెనకేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఎవరికి బెస్ట్? ఖాళీగా ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు, అదనపు ఆదాయం కావాలనుకునే గృహిణులకు ఇది ‘బెస్ట్ సీజనల్ బిజినెస్’. సిగ్గుపడకుండా ముందడుగు వేస్తే.. ఈ సమ్మర్ మీకు కాసుల వర్షం కురిపిస్తుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

