Business

NCC Jobs :లేడీస్‌కి బంపర్ ఆఫర్: పరీక్ష లేదు.. ఫీజు అసలే లేదు! రూ. 1.77 లక్షల జీతంతో ఆర్మీలో ఆఫీసర్ జాబ్!

NCC Jobs :లేడీస్‌కి బంపర్ ఆఫర్: పరీక్ష లేదు.. ఫీజు అసలే లేదు! రూ. 1.77 లక్షల జీతంతో ఆర్మీలో ఆఫీసర్ జాబ్.. దేశ సేవ చేయాలనే కలతో ఉన్న మహిళలకు ఇండియన్ ఆర్మీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. చేతిలో ఎన్‌సీసీ (NCC) సర్టిఫికేట్ ఉంటే చాలు.. రాత పరీక్ష లేకుండా, నయా పైసా ఖర్చు లేకుండా నేరుగా ఆర్మీలో ఆఫీసర్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ మీ ముందుకొచ్చింది.

NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124 (అక్టోబర్ 2026) కోర్సు కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు ఇవే!

జాబ్ హైలైట్స్ ఇవే:
పోస్టు: షార్ట్ సర్వీస్ కమిషన్ (NT) – మహిళలు.
అప్లికేషన్ ఫీజు: రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు (No Fee).
జీతం: నెలకు ₹56,100 నుంచి మొదలై ₹1,77,500 వరకు (హోదాను బట్టి). దీంతో పాటు ఆర్మీ ఆఫీసర్‌కు ఉండే పవర్, గౌరవం, ఇతర సౌకర్యాలు అదనం.
మొత్తం ఖాళీలు: 06 పోస్టులు.

అర్హతలు ఏంటి?
చదువు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (Graduation) పాస్ అయి ఉండాలి. (ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేయొచ్చు, కానీ జాయిన్ అయ్యే నాటికి సర్టిఫికేట్ ఉండాలి).
కీలక అర్హత: ఎన్‌సీసీ (NCC) ‘C’ సర్టిఫికేట్‌లో కనీసం ‘B’ గ్రేడ్ ఉండటం తప్పనిసరి.
వయస్సు: 19 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి (జూలై 1, 2026 నాటికి).
(జననం 02 జూలై 2001 నుండి 01 జూలై 2007 మధ్య ఉండాలి).

ముఖ్యమైన తేదీలు (నోట్ చేసుకోండి):
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 13, 2026 (మధ్యాహ్నం 3 గంటల నుంచి).
చివరి తేదీ: మార్చి 16, 2026 (మధ్యాహ్నం 3 గంటల వరకు).

ఎంపిక ఎలా?
రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా SSB ఇంటర్వ్యూకు పిలుస్తారు. అక్కడ ప్రతిభ చూపిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి?
కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.

అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in కి వెళ్లండి.

“Officer Entry/Login” పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

ఆల్ ది బెస్ట్: దేశం కోసం నిలబడాలనుకునే మహిళలకు ఇది అద్భుతమైన అవకాశం. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/