Business

AP News:కేవలం రూ.20 కడితే రూ.2 లక్షల భీమా.. ఏపీ ప్రభుత్వం 2 కొత్త పథకాలు!

AP News:కేవలం రూ.20 కడితే రూ.2 లక్షల భీమా.. ఏపీ ప్రభుత్వం 2 కొత్త పథకాలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విశేష సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.

వారికి మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. నామమాత్రపు ప్రీమియంతో రూ.2 లక్షల వరకు భీమా కల్పించే రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు వర్తింపజేస్తూ ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ రెండు పథకాలు ఏంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పీఎం జీవనజ్యోతి యోజన (PMJJBY).. అనుకోని ఆపద వస్తే అంగన్‌వాడీల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.

ఎవరు అర్హులు?: 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దీనికి అర్హులు.
ప్రీమియం ఎంత?: సంవత్సరానికి కేవలం రూ. 436 చెల్లిస్తే సరిపోతుంది.
ప్రయోజనం: ఏదైనా కారణం చేత లబ్ధిదారు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. (గమనిక: 50 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం వర్తించదు).

2. పీఎం సురక్ష బీమా యోజన (PMSBY)..ఇది అత్యంత తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రతను ఇచ్చే అద్భుతమైన స్కీమ్.

ప్రీమియం ఎంత?: ఏడాదికి కేవలం రూ. 20 చెల్లిస్తే చాలు!
మరణం/పూర్తి వైకల్యం: ఏదైనా ప్రమాదం జరిగి మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం (పూర్తిగా) సంభవించినా కుటుంబానికి రూ. 2 లక్షలు అందిస్తారు.
పాక్షిక వైకల్యం: ఒకవేళ ప్రమాదంలో పాక్షికంగా వైకల్యం పొందితే రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందుతుంది.

ప్రభుత్వం ఏమంటోంది?
ఈ రెండు పథకాల వల్ల వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు గొప్ప భద్రత లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తక్కువ ప్రీమియంతో ముడిపడి ఉన్న ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్క అంగన్‌వాడీ కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/