Beauty Tips

Hair Growth Tips:కేవలం 15 రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు మాయం.. ఇంట్లోనే ఉండే ఈ 3 వస్తువులతో అద్భుతమైన రిజల్ట్!

Hair Growth Tips:కేవలం 15 రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు మాయం.. ఇంట్లోనే ఉండే ఈ 3 వస్తువులతో అద్భుతమైన రిజల్ట్.. మారుతున్న జీవనశైలి, కాలుష్య ప్రభావం వల్ల జుట్టు రాలడం, చుండ్రు అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్యలు.

ఈ సమస్యలు రాగానే వెంటనే మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ, మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో కేవలం 15 రోజుల్లో ఈ సమస్యల నుండి సులభంగా ఎలా బయటపడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు ఇవే:
పెరుగు: 1 కప్పు
కలోంజీ (నల్ల జీలకర్ర) పొడి: 1 స్పూన్
ఆముదం నూనె: 2 స్పూన్లు

తయారీ మరియు వాడే విధానం:
ముందుగా ఒక గిన్నెలో కప్పు పెరుగు తీసుకొని, అందులో కలోంజీ గింజల పొడి, ఆముదం వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.అరగంట పాటు అలాగే ఉంచుకుని, ఆ తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తే.. జుట్టు రాలడం, చుండ్రు తగ్గిపోయి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం మీరే గమనిస్తారు.ఈ ప్యాక్ ఎందుకు అంత ఎఫెక్టివ్ అంటే..

ఆముదం నూనె: పూర్వకాలం నుండి ఆముదాన్ని జుట్టు సంరక్షణకు వాడుతున్నారు. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలకుండా అడ్డుకుంటుంది. కుదుళ్లకు అవసరమైన పోషణను అందించి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది.

పెరుగు: పెరుగులో ఉండే పోషకాలు కుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. తల చర్మాన్ని (Scalp) తేమగా ఉంచి, చుండ్రు సమస్యకు చెక్ పెడతాయి.

ఇంటి చిట్కాలు కాస్త ఓపికతో పాటిస్తే ఎంతో ఎఫెక్టివ్ గా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. ఈ ప్యాక్ కి ఉపయోగించే పదార్థాలన్నీ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి, ఈ రోజే ట్రై చేయండి!

గమనిక: ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే అందించబడ్డాయి. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. తీవ్రమైన సమస్యలు ఉన్నవారు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.