Business

South Indian Bank Recruitment 2026: రాత పరీక్ష, ఫీజు లేదు! డిగ్రీ ఉంటే చాలు.. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో అదిరిపోయే జాబ్ ఛాన్స్!

South Indian Bank Recruitment 2026: రాత పరీక్ష, ఫీజు లేదు! డిగ్రీ ఉంటే చాలు.. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో అదిరిపోయే జాబ్ ఛాన్స్..బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్ కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ ‘సౌత్ ఇండియన్ బ్యాంక్’ (South Indian Bank) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ‘జూనియర్ ఆఫీసర్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (2026) విడుదల చేసింది.

అప్లికేషన్ ఫీజు కూడా లేకపోవడంతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

సంస్థ: సౌత్ ఇండియన్ బ్యాంక్

పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్

అర్హత: ఏదైనా డిగ్రీ (ఫ్రెషర్స్ అర్హులే)

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా ఎక్కడైనా

చివరి తేదీ: 02 మార్చి 2026

ఈ నోటిఫికేషన్ ఎందుకు స్పెషల్..ఈ ఉద్యోగాలకు ఇంతలా డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణాలు ఇవే:

రాత పరీక్ష లేదు: కేవలం గ్రూప్ డిస్కషన్ (GD), పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు.

ఫీజు లేదు: దరఖాస్తు చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫ్రెషర్స్‌కు వెల్‌కమ్: ఎలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హతలు & వయోపరిమితి
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BA, BCom, BSc, BBA లాంటి ఏ డిగ్రీ పూర్తి చేసిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి అదనపు ప్రాధాన్యత ఉంటుంది.

వయస్సు: 01 ఫిబ్రవరి 1996 నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది).

ఎలా ఎంపిక చేస్తారు?
ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా గ్రూప్ డిస్కషన్ (GD) నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, బ్యాంకింగ్ బేసిక్స్ మరియు కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉన్నవారు ఈ ఉద్యోగాన్ని సులభంగా సాధించవచ్చు.

దరఖాస్తు విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది.అభ్యర్థులు సౌత్ ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారాన్ని నింపాలి.ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఫోటో, మరియు రెజ్యూమ్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

చివరి తేదీ: మార్చి 02, 2026. గడువు ముగిసేలోపు వెంటనే అప్లై చేసుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/