గుండె నిండా గుడి గంటలు: ‘మనోజ్’ అవుట్.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
స్టార్ మాలో సూపర్ హిట్‌గా దూసుకుపోతున్న ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ ప్రేక్షకులకు ఓ షాకింగ్ న్యూస్. ఈ సీరియల్‌లో ‘మనోజ్’ (యశ్వంత్) పాత్ర ఇకపై కనిపించదనే వార్త బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో బాలు క్యారెక్టర్ బిగ్ బాస్‌కు వెళ్తున్నాడనే ప్రచారం జరిగి అది అబద్ధమని తేలగా, ఇప్పుడు మనోజ్ వంతు వచ్చింది.
కొత్త సీరియల్ వల్లే దూరమవుతున్నాడా?
ఈ సీరియల్‌లో హీరో బాలు చేత ‘లక్షలు మింగినోడు’ అని పిలిపించుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న మనోజ్.. ప్రస్తుతం ‘నిన్ను కోరి’ అనే మరో కొత్త సీరియల్‌లో నటిస్తున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్ కారణంగానే ఆయన ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.
ఒకవేళ నిజంగానే మనోజ్ సీరియల్ నుంచి వెళ్లిపోతే, బాలు ఆడుకోవడానికి మరో కొత్త క్యారెక్టర్‌ను తీసుకురావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రోజుకు రూ.35 వేల రెమ్యునరేషన్!
బుల్లితెరపై నటుడు యశ్వంత్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ ద్వారా తన క్రేజ్‌ను అమాంతం పెంచుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, యశ్వంత్ ఒక్క రోజు షూటింగ్‌కు ఏకంగా రూ. 35 వేలకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు సీరియల్స్ చేస్తూనే, ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ యశ్వంత్ కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్నాడు.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

