Movies

మనమరాలు వయసు ఉన్న హీరోయిన్స్ తో ఆడిపాడిన మన టాప్ హీరోలు

హీరోలు ఎంతవయస్సు వచ్చినా హీరోలుగా నటిస్తారు. అదే హీరోయిన్స్ ఐతే కొంతకాలానికి అమ్మ పాత్రలో, అక్క, వదిన,అత్తా పాత్రలో అమ్మమ్మ పాత్రలకో మారిపోవాల్సిందే. ఇక మనవరాలి వయస్సున్న హీరోయిన్స్ తో కూడా హీరోలుగా నటించి,వాళ్ళతో డ్యూయెట్స్ పాడిన నటులు కూడా ఉన్నారు. షష్టి పూర్తి దాటినా కుర్రకారుగా మారుతూ కుర్ర హీరోయిన్స్ తో కల్సి నటిస్తున్నారు. ఈవిధంగా మేల్ డామినేషన్ పెరిగిపోయి,ఫీమేల్ ఫేడవుట్ అవుతున్నారు.

అందాల నటి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు 9ఏళ్ళ వయస్సులో బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించింది. 16ఏళ్ళ వయస్సు వచ్చేసరికి 16ఏళ్ళవయస్సు చిత్రంలో నటించింది. ఇక వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించింది. తనకన్నా 40ఏళ్ళు చిన్నదైన శ్రీదేవితో ఎన్టీఆర్ డ్యూయెట్ లో చిందేశారు. అయితే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని డైరెక్టర్ రాఘవేంద్రరావు,ఎన్టీఆర్ తో పాటు యూనిట్ మొత్తం అనుకున్నారట. కానీ సినిమా విడుదలయ్యాక, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ,బ్రహ్మరధం పట్టారు. ఆకుచాటు పిండెతడిసే అనే వాన పాట ఎవర్ గ్రీన్ సాంగ్ అయింది.

ఆతర్వాత గజదొంగ, సర్ధార్ పాపారాయుడు,బొబ్బిలిపులి,కొండవీటి సింహం,రౌడీ రాముడు కొంటె కృష్ణుడు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ , శ్రీదేవి నటించి మెప్పించారు. ఆరోజుల్లో ఈ జంట హిట్ ఫెయిర్ అయ్యారు. అలాగే ఎన్టీఆర్ కి సమాన వయస్సు అయిన అక్కినేని నాగేశ్వరరావు కూడా శ్రీదేవితో నటించి మెప్పించారు. ముద్దుల కొడుకు,ప్రేమాభిషేకం,శ్రీరంగ నీతులు,ప్రేమకనుక వంటి చిత్రాల్లో అక్కినేని,శ్రీదేవి కల్సి నటించి హిట్ ఫెయిర్ గా నిలవడం విశేషం. తెలుగు చలనచిత్రంలో సువర్ణాక్షరాలో లిఖించదగ్గ ప్రేమాభిషేకం మూవీలో దేవి మౌనమా,శ్రీదేవి మౌనమా ,నా కళ్ళు చెబుతున్నాయ్ నిను ప్రేమించానని వంటి గీతాలు ఎవర్ గ్రీన్ హిట్ అయ్యాయి. అక్కినేనితో జోడికట్టిన శ్రీదేవి ఆతర్వాత కాలంలో అక్కినేని వారసుడు నాగార్జునతో జోడీకట్టి అదరగొట్టింది. నాగార్జున తో ఆఖరి పోరాటం,గోవిందా గోవిందా, ఖుదాగవా వంటి చిత్రాల్లో శ్రీదేవి నటించింది.

ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా జయసుధ,జయప్రద,శ్రీదేవి మొదలుకుని విజయశాంతి, ఆమని, సౌందర్య,ఇంద్రజ,రాధికా,తదితరులతో కల్సి నటించాడు. అమ్మదొంగా మూవీలో తన మనవరాళ్లు వయసున్న ఆమని, సౌందర్య,ఇంద్రజ లతో కల్సి చేసిన కృష్ణ ఆ మూవీతో మంచి హిట్ కొట్టారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా అదే పంధాలో వెళ్తున్నారు. వేట మూవీలో జయప్రద,మగధీరుడు చిత్రంలో జయసుధ,జగదేక వీరుడు అతిలోక సుందరి,ఎస్పీ పరశురామ్ వంటి చిత్రాల్లో శ్రీదేవితో కల్సి నటించిన చిరంజీవి, తర్వాత రాధికా,సుమలత,మాధవి,రాధ,విజయశాంతి వంటివారితో జతకట్టాడు. తమ్ముడు పవన్,కొడుకు రామ్ చరణ్,మేనల్లుడు బన్నీతో కల్సి నటించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తో కల్సి ఖైదీ నెంబర్ 150సినిమాలో నటించాడు. ఆమె వయస్సు చిరంజీవి కూతురికన్నా తక్కువే. కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ లతో నటించిన కాజల్ బాలయ్య తో కూడా జతకడితే అందరి హీరోలతో కల్సి నటించిన ఘనత కాజల్ సొంతం అవుతుంది.