Movies

చెర్రీతో పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పేసిన ఉపాసన… రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీ

లవ్ మేరేజ్ చేసుకున్న వాళ్ళు ఒకరినుంచి ఒకరు ఎలా ఉండాలో నేర్చుకుని అన్యోన్యంగా ఉండాలి. సరిగ్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,ఉపాసన అలాగే ఉంటున్నారు. ‘రామ్ నుంచి సహనంగా ఉండడం నేర్చుకున్నాను. నానుంచి సంతోషం గా ఉండడం రామ్ నేర్చుకున్నాడు’అని చెర్రీతో పరిచయం ఎలా ఏర్పడిందో ఓ ఇంటర్యూలో ఉపాసన చెబుతూ వెల్లడించింది. ఇద్దరం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశామని, ఆతర్వాత ఇద్దరి మధ్యా పరిచయం స్నేహంగా ఏర్పడిందని చెప్పుకొచ్చింది.

వృత్తి పరంగా ఒకరి నొకరు అధిగమించేవాళ్లమని,ఇలా మా మధ్య ఏదో గట్టి బంధం ఉందనిపించింది. ఒకరినొకరు గౌరవించుకుంటున్నామని అర్ధం అవ్వడంతో పెళ్లి చేసుకోవాలని అప్పుడు నిర్ణయించుకున్నాం అని ఉపాసన వెల్లడించింది. ఇద్దరి మధ్యా దాపరికాలు లేవు. ఇక వృత్తిపరమైన అభిప్రాయలు ఎవరికీ వారికే ఉన్నాయి.

అయితే కెరీర్ ఉన్నతంగా ఎలా ఉండాలో చర్చించుకుంటాం అని వివరించింది. ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం, పనిని వెంటతీసుకుని ఇంటికి రావడం వంటివి ఇద్దరికీ లేవని ఆమె స్పష్టంగా చెప్పేసింది. సూపర్ స్టార్ అయినా మెగాస్టార్ అయినా చాలా కష్టపడకపోతే రాదనీ,ఎవరికీ వాళ్ళు కష్టపడాలని ఉపాసన వెల్లడించింది.

ఇతరులలో నచ్చని అంశాలు చాలా వుంటాయని,అయితే వాటిని మార్చుకుంటూ సర్దుకుపోవడం నేర్చుకోవాలని,అదే పెళ్లిలో పరమార్ధమని ఉపాసన పేర్కొంది. అలాగే మనల్ని మనం గౌరవించుకుంటూ,ఇతరులను కూడా గౌరవించాలని ఉపాసన స్పష్టం చేసింది. అప్పుడే జీవితం ఆనందంగా సాగిపోతుందని చెప్పింది.