Movies

సంపూర్ణేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలు…. ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ పేరు పరిచయం అవసరంలేని పేరు. అంతగా పాపులర్ అయిన నటుడు యితడు. నవరసాలు పలికించే సంచలన నటుడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయిన వినూత్న నటుడు సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ సోషల్ మీడియా తో విశేష ప్రాచుర్యం పొందాడు. బర్నింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన సంపూ తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట షూటింగ్ కూడా ప్రారంభయ్యింది. సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. తెలంగాణా లోని సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి గ్రామంలో మధ్యతరగతి విశ్వకర్మ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి ఒక అన్న, ఇద్దరు అక్కలు. సంపూ ఏడో తరగతి చదివేటపుడు తండ్రి మరణించాడు.

అన్నయ్య బంగారం పనికోసం బయట పనిచేస్తుండేవాడు.అన్నయ్య వత్తిడి మేరకు మళ్ళీ పాఠశాల్లో చేరాడు . తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. పదో తరగతి పూర్తయిన తర్వాత అన్నకు సహాయంగా ఉండటం కోసం నెమ్మదిగా తను కూడా అదే పని నేర్చుకున్నాడు. బంగారం షాపులో పనిచేస్తున్న సమయంలో పెళ్లయింది. సంపూకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఆపదలో ఉండేవాళ్ళకు తనవంతు సాయం అందించే దయార్ద్ర హృదయం గల మనిషి గా సంపూకి పేరుంది.

ఆ విధంగా ఎందరికో సాయం చేసిన సంపూ ఏపీలో తిత్లి తుపాన్ బాధితుల సహాయార్ధం 10లక్షల రూపాయల సాయం కూడా అందించిన సంగతి తెల్సిందే. హీరోగా చేసున్నప్పటికీ సొంతూరు వెళ్ళినపుడు సామాన్య వ్యక్తిగా సైకిలుపై వెళ్లి నీళ్లు తెస్తాడు. సంపూర్ణేష్ బాబుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. వారి ఊళ్ళో నాటకాలు చూసి ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్ తో కల్సి నాటకం వేస్తూ ఆనందించేవాడు. ఇక సినిమాల్లో చేయాలనే కోరిక ఉండేది.

ఓరోజు సిటీ కేబుల్ చూస్తుంటే,సీరియల్ లో కొత్త నటులు కావాలని ప్రకటన రావడంతో సిద్ధిపేటలో ఆడిషన్స్ కి వెళ్లి 200మందిలో పోటీపడి సెలెక్ట్ అయ్యాడు. అయితే నటన నేర్చుకోవాలని సూచించడంతో వారి ఊళ్ళో సిల్వర్ సురేష్ అనే వ్యక్తిదగ్గర నటన నేర్చుకుంటూ సినిమాల్లోకి వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే పనులు చేసుకో ,సినిమాలు వద్దు అంటూ వాళ్ళ అన్నయ్య కేకలు వేసాడు. దీంతో బంగారం షాపుకి వెళ్లి తన పని తాను చేసుకున్నాడు.అయితే ఆ ఊరికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాలో ఓ పాత్రలో చేయడానికి నటుడు కావాలని అనుకున్నారట.

విషయం తెల్సి సంపూ అక్కడికి వెళ్ళాడట. ఆవిధంగా సర్ధార్ పాపారాయుడు అనే మూవీలో నటించాడు. అది విడుదల కాలేదు. బంగారం షాపు చూసుకుంటూ మరోపక్క సినీ ఛాన్స్ లకోసం హైదరాబాద్ వచ్చి స్టూడియోల చుట్టూ తిరిగేవాడట. ఆసమయంలో సినీ ఛాన్స్ లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని కొందరు మోసం చేయడం వలన 10వేలరూపాయల వరకూ పోగొట్టుకున్నాడు. స్టూడియోలో ఫోటోలు ఇచ్చి వెళ్లేవాడట. ఓరోజు కృష్ణవంశీ చూసి సురేష్ కి ఫోన్ చేయడంతో సంపూని వెంటబెట్టుకుని వచ్చాడు.

ఆలా మహాత్మ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న సంపూకి ఇతర నటులతో పరిచయం ఏర్పడి,ఆపరేషన్ ఐపీఎస్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. అదికూడా ఆడలేదు. దీంతో సొంత ఊరికి వెళ్లి బంగారం పనులు చేసుకునేవాడట. అయితే ఒకరోజు స్టీఫెన్ శంకర్ అలియాస్ రాజేష్ అనే డైరెక్టర్ ఫోన్ చేసి, రమ్మనడంతో వెళ్ళాడు. నువ్వు హీరోగా హృదయ కాలేయం అనే సినిమా తీయాలని నిర్ణయించామని స్టీఫెన్ శంకర్ చెప్పడంతో ఒకింత షాక్ అయ్యాడట.

కొన్ని వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ సినిమా తో పేరువచ్చింది. దాంతో తనపేరుని సంపూర్ణేష్ బాబుగా మార్చుకున్నాడు. ఆతర్వాత కరెంట్ తీగ ,బందిపోటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసాడు. వైరస్,సింగం 123,కొబ్బరి మట్ట అనే సినిమాల్లో హీరోగా చేసినా, అవి హిట్ కాలేదు. అయితే తన నటనతో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ షో లో పాల్గొని 9వ రోజు ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు.