Movies

మజిలీ మూవీలో చైతు కూతురుగా వేసిన ఈ పాప బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

నాగ చైతన్య,సమంత జంట గతంలో మూడు సినిమాల్లో నటించి హిట్ కొట్టగా, పెళ్లయ్యాక ఈ జంట నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఏడాదిన్నరగా వరుస ప్లాప్ లు చూస్తున్న చైతు కెరీర్ లో ఈ మూవీ ఓ అద్భుత మూవీగా నిల్చింది. మరి ఈ మూవీలో చైతు కూతురుగా నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో అదరగొట్టింది. సీరియల్స్ తో పాటు బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి, కమర్షియల్ యాడ్స్ టాటా సాల్ట్,ఆల్ అవుట్, క్లినిక్ ప్లస్ వంటి వాటిలో తన సత్తా చాటింది. 

స్టార్ ప్లస్ లో 2015, 2016లో ప్రసారం అయిన సియాకే రామ్ అనే సీరియల్ లో సీతమ్మగా నటించింది. 15ఏళ్ళ వయస్సులో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మజిలీ సినిమాతో  తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈమె పేరు అనన్య అగర్వాల్. హిందీ సీరియల్స్,బాలీవుడ్ మూవీస్ లో నటించి మెప్పించిన ఈమె జి టివి,స్టార్ ప్లస్ ఛానల్స్ సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మజిలీ మూవీలో నటించి సక్సెస్ అందుకున్న అనన్య భవిష్యత్తులో మరిన్ని మూవీస్ చేస్తుందని ఆశిద్దాం.