Movies

“మహర్షి” యావరేజ్ అవ్వకూడదంటే ఆ సెంటిమెంట్ బ్రేక్ చెయ్యాల్సిందే..!

హీరోలకు ప్రతి సినిమా అగ్ని పరీక్షే. అందునా రజతోత్సవ , స్వర్ణోత్సవ,వందవ సినిమాలంటే మరీ హైప్ క్రియేట్ అవుతాయి. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా “మహర్షి” కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వచ్చేసాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తాలూకా ప్రీ రిలీజ్ వేడుక వచ్చే మే 1 న ఘనంగా హైదరాబాద్ లో చేస్తారట. మే 9న సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.మహేష్ 25వ సినిమా కావడంతో ఈ చిత్రాన్ని మహేష్ ఫాన్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఫాన్స్ అంచనాలకు తగ్గట్టుగా వంశీ పైడిపల్లి ఈ సినిమా తెరకెక్కించారనే అనుకుంటున్నారు.

అయితే ఈ చిత్రం ఫలితంపై మహేష్ అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. మన టాలీవుడ్ లో సెంటిమెంట్ లు ఎక్కువ కదా. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంటే “మహర్షి” సినిమాను యావరేజ్ గా నిలబడుతుందా లేక బ్లాక్ బస్టర్ గా నిలబడుతుందా అని మహేష్ అభిమానులు తెగ చర్చించు కుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

పూజా గత సినిమాలు చూసుకున్నట్లైతే ఏ సినిమా కూడా ఊహించిన స్థాయి హిట్ కానీ లాభాల బాట కానీ పట్టలేదు. చివరికి త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన “అరవింద సమేత” చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకొని, యావరేజ్ సినిమాగానే మిగిలిపోవాల్సి వచ్చింది. అందుకే ఈ చిత్రం రిజల్ట్ పై మహేష్ అభిమానులు ఖంగారు పడిపోతున్నారు. మరి సెంటిమెంట్ ని ఈ సినిమా బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.