కమెడియన్ సుధాకర్ ఎవరి వల్ల కోమాలోకి వెళ్ళాడు…అతని మొత్తం ఆస్తుల వివరాలు
సినిమా రంగంలో ఎప్పుడు ఎవరు ఎలా వుంటారో తెలియదు. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగి కూడా చిల్లిగవ్వలేని వాళ్ళూ ఉన్నారు. సంపాదించిన వాళ్ళూ ఉన్నారు. ఇక తమిళంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి , తెలుగులో స్టార్ కమెడియన్ గా రాణించిన సుధాకర్ 2010జూన్ 29న అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి, జులై 4నుంచి కోమాలోకి వెళ్ళిపోయాడు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సుధాకర్ తండ్రి గంగామాల రత్నం డిప్యూటీ కలెక్టర్ గా చేసారు. తల్లి కటాక్షమ్మ. వీరికి ఏడుగురు మగ సంతానం. అందులో సుధాకర్ చిట్టచివరి వాడు. తండ్రి ఉద్యోగ రీత్యా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసారు. అందుకే కర్నూల్ జిల్లా కోయిలకుంటలో పనిచేస్తున్నప్పుడు సుధాకర్ పుట్టాడు. ఆదోని,కర్నూల్ , కోడుమూరు,బోధన్ నుంచి కాకినాడ వరకు అన్ని చోట్లా రత్నం పనిచేసారు.
ఏలూరు , గుంటూరులలో స్టడీస్ పూర్తిచేసిన సుధాకర్ తొలి చిత్రం సృష్టి రహస్యాలు సినిమాలో నటించాడు. తెలుగులో విలన్ గా, కమెడియన్ గా కారెక్టార్ ఆర్టిస్టుగా రాణించాడు. ఊరికిచ్చినమాట, భోగిమంటలు వంటి చిత్రాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కన్నా ముందే స్టార్ హీరో గా రాణించిన సుధాకర్, తమిళంలో భారతీరాజా తీసిన మూవీలో హీరోగా వేసాడు. అందులో రాధికా హీరోయిన్ గా చేసింది. అలా ఏకంగా 18సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. దాదాపు 45చిత్రాల్లో నటించాడు. తన రూమ్ మేట్స్ చిరంజీవి,నారాయణరావు,హరిప్రసాద్ లకన్నా సుధాకర్ ముందుండేవాడు. అయితే తమిళ సిని, రాజకీయాల్లో వచ్చిన మార్పుల కారణంగా తెలుగుకే పరిమితం అయిన సుధాకర్ ఇక్కడ విలన్ గా, కమెడియన్ గా స్థిరపడాల్సి వచ్చింది. ఒకదశలో చిరంజీవితో కల్సి యముడికి మొగుడు మూవీ తీసాడు. హరిప్రసాద్,నారాయణరావు లు కూడా సుధాకర్ తో కల్సి నిర్మాతలుగా వ్యవహరించారు.
తాతయ్య పెళ్లి మనవడి శోభనం, పరుగో పరుగు వంటి సినిమాలు కూడా సుధాకర్ నిర్మించాడు. పెద్దరికం లాంటి సినిమాల్లో సుధాకర్ నటన మెప్పించింది. శుభాకాంక్షలు, స్నేహితుడు వంటి సినిమాల్లో నటనకు నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇక కోమాలోంచి 2015లో కోలుకుని, సిన్మాలు చేయబోతున్నామని ప్రకటించాడు. అయితే సుధాకర్ సినిమాల్లో హీరోగా , కమెడియన్ గా రెమ్యునరేషన్ బాగానే అందుకోవడం వలన కొన్ని ఆస్తులు కొన్నాడని అందుకే సుధాకర్ కి గల ఆస్తులు కోట్ల విలువలో ఉంటాయని ఎలాంటి ఇబ్బంది లేదని నారాయణరావు వంటి మిత్రులు చెబుతారు. కోమాలో ఉన్నపుడు మిత్రులు చిరంజీవి,నారాయణరావు వంటివాళ్ళు వెళ్లి మంచి చెడ్డలు చూసారు.

