Movies

టాప్ హీరోయిన్స్ సమంత,నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనికి కాలం కలిసి వచ్చినట్టు కనిపిస్తున్నది. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ ఏడాది రెండో హిట్‌ను కూడా ఖాతాలో వేసుకొన్నది. ఇటీవల విడుదలైన ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించడంతో సమంత రెంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. అంతేకాకుండా సమంత బాక్సాఫీస్ స్టామినా కూడా పెరిగింది. దాంతో తాజాగా తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు సమాచారం. తదుపరి సినిమాకు ఆమె ఎంత పారితోషికం తీసుకొంటున్నారంటే..ఓ బేబీ సినిమాకు ముందు వరకు సమంత అక్కినేని రెమ్యునరేషన్ సుమారు రూ.2 కోట్లు ఉందనేది సినీ వర్గాల సమాచారం. అయితే ఓ బేబీ విజయం తర్వాత సమంత తన బాక్సాఫీస్ సత్తాను తెలుసుకొని భారీగా పారితోషికాన్ని పెంచేసిందంట.

ఓ బేబి సినిమాకు సమంత 2 కోట్లు తీసుకోగా, ఇక ముందు నటించే సినిమాలకు రూ.1 కోటీ పెంచేసినట్టు..అంటే మూడు కోట్లకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిందట.తాజా రెమ్యునరేషన్ పెంపుతో సమంత అత్యధికంగా పారితోషికం తీసుకొనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. దక్షిణాదిలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా రెండో స్థానంలో నిలిచింది. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకొనే వారిలో నయనతార ముందున్నారు. తాజా పెంపుతో ఆమెకు సమంత చేరువైంది.దక్షిణాదిలో ఇటీవల కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే వారిలో నయనతారకే అగ్రతాంబూలం. 
ప్రతీ సినిమాకు నయనతార రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. వరుస విజయాలు పలకరించడంతో మరింత పారితోషికాన్ని కూడా నయనతారకు చూపుతున్నారని తెలుస్తున్నది.

స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌ విషయంలో భారీగా వ్యత్యాసం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అలాంటి వాటికి నయనతార, సమంత పారితోషికాలు సరిగానే సమాధానం చెప్పేలా ఉన్నాయనే మాట వినిపిస్తున్నది.

ఈ ఇద్దరు హీరోయిన్లు మిగితా యువ తారలకు ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నారు.ఇక ఓ బేబీ సినిమా తర్వాత, సమంత అక్కినేని మన్మథుడు 2 సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నది. నాగార్జున, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."