Movies

ఈ స్టార్స్ కు ఉన్న అంగవైకల్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకోవాలంటే డబ్బు,పలుకుబడి బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదని చాలా సందర్భాలలో చాలా మంది నటుల విషయంలో చూసాం.అలాగే కష్టపడి పైకి వచ్చినవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే అంగవైకల్యం ఉన్నా అది ఎవ్వరికీ తెలీకుండా మేనేజ్ చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు ఉన్నారు. వారి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

సుధా చంద్రన్
సుధా చంద్రన్ గొప్ప డాన్సర్. ఆమెకు ఒక కాలు యాక్సిడెంట్ లో విరిగింది.కాని ఆమె తన నాట్యం తో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఆమె కథతో ఆమెనే హీరోయిన్ గా పెట్టి సంగీతం శ్రీనివాసరావుగారు సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా మయూరి. ఆమెకు ఒక కాలు లేకపోయినా హ్యుమన్ మేడ్ కాలుతో నాట్యం చేసి ఆ సినిమాకు 14 నంది అవార్డులు వచ్చేలా చేసింది.

ధ్రువ శర్మ
కన్నడ స్టార్ ధ్రువ్ శర్మ ,ఆయన రీసెంట్ గా చనిపోయారు. కాని పుట్టుకతో మూగ,చెవుడు రెండూ ఉన్నాయి.కాని ఆయన స్వయం కృషితో ఎంతో కష్టపడి కన్నడ లో హీరోగా అనేక సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సంపాదించుకున్నాడు.

రాణా
బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రానాకు ఒక కన్ను కనపడదు. ఆ విషయాన్నీ రాణా స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. అప్పటివరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.

అభినయ
అభినయ తెలుగులో,తమిళ్ భాషల్లో నటిస్తున్న ఈమె కూడా మూగ,చెవుడు. కాని ఆమె తన నటనతో అందరిని ఏడిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్,వెంకీ ల చెల్లి పాత్రను పోషించింది అభినయ.

నితిన్
నితిన్ నితిన్ ఇప్పూడు క్రేజ్ ఉన్న మరో స్టార్ హీరో. ఆయన కు నత్తి అని మీకు తెలుసా.సినిమాలలో కూడా ఆయన మొదట డబ్బింగ్ హీరో శివాజి తో చెప్పించుకున్నాడు.కాని అలా నచ్చక కష్టపడి నత్తి పోగోట్టుకోవాలని తానే స్వయం గా డబ్బింగ్ చెప్పేవాడు.ఇప్పుడు చాలా బెటర్ అయ్యాడు.

అలీ
అలాగే కాంతారావు,ఆలీ లకు కూడా నత్తే .కాని ఏనాడు వారికి అవి లోపాలు అని తెలీకుండా చేసి ఎంతో కష్టపడి సాధన చేసి మాములుగా మాట్లాడాలి అనే పట్టుదలతో అన్ని అధిగమించి స్టార్లు అయ్యారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."