మాతృ భాష “తెలుగు” కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం మరొక ఉద్యమానికి నాంది పలికింది. తెలుగు భాషని ఒక సబ్జెక్టు గా చేసి, ఇంగ్లీష్ మీడియం లోనే అన్ని బోదించేటట్లుగా జగన్ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ విషయం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజం ఎత్తారు. అయితే పవన్ జగన్ మోహన్ రెడ్డి కి కొన్ని విషయాలను తెలియజేసారు. ఇంగ్లీష్ భాషని వద్దని ఎవరు చెప్పడం లేదు, కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మాతృభాషని మాండలి కాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు.
పవన్ ఇంగ్లీష్ మీడియం పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ ని నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది అని అన్నారు. జగన్ రెడ్డి గారు మా తెలుగు తల్లి అని పాడాల్సిన మీరు తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
