Movies

10 సంవత్సరాల కెరీర్ లో నాగ చైతన్య చేసిన 6 తప్పులు

అక్కినేని నాగార్జున వారసునిగా 2009సెప్టెంబర్ 5న జోష్ మూవీతో నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే పదేళ్లు పూర్తయినా సరే,అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వాటిని ఫుల్ ఫిల్ చేయలేకపోయాడు. తొలిసినిమా జోష్ కి మంచి క్రేజ్ వచ్చినా,డాక్టర్ వైస్సార్ మరణం నేపధ్యం కావడంతో అనుకున్నంతగా ఆడలేదు. పైగా అందరూ ఆశించనంత స్థాయిలో సినిమా లేదు. ఇక ఆతర్వాత మంచి ప్రాజెక్ట్ లను కూడా ఎంచుకోలేక పోయాడని చెప్పాలి. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్,ఫుల్ సపోర్ట్ ,భారీగా ఫాన్స్ ఉన్నారు. అయినా ఏమి లాభం అన్నట్టు ఉంది.

నందమూరి,కొణిదెల,ఘట్టమనేని కుటుంబాలలాగే అక్కినేని ఫ్యామిలీకి కూడా ఇండస్ట్రీలో ఓ గుర్తింపు వుంది. భారీగా తరలివచ్చే అభిమానులున్నారు. అయితే వారిని సంతృప్తి పరిచే సినిమాలు చేస్తేనే నాగచైతన్యకు భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే సెకండ్,థర్డ్ గ్రేడ్ హీరోలుగా మిగిలిపోతారు. అలా మొదటి నుంచి చైతూ తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఓ స్టార్ హీరో కొడుకు ఎంట్రీ అంటేనే భారీ అంచనాలుంటాయి. అయితే చైతూ మొదటి సినిమా అది రీచ్ కాలేదు. తర్వాత సినిమాల్లో అయినా జాగ్రత్త వహించి,స్టార్ డైరెక్టర్స్ తో చేయాలి. అప్పుడే హీరోగా నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది.

రెండో సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్,స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ కమర్షియల్ గా నిలబెట్టేంత స్థాయిలేదు. ఇక అప్పట్లో సుకుమార్ కూడా అలాగే. మూడో సినిమా హీరోయిన్ బేస్డ్ మూవీ. దడ, బెజవాడ,ఆటోనగర్ సూర్య,ఇలా అన్ని సినిమాలు సెకండ్ డైరెక్టర్స్ చేతనో,కొత్త డైరెక్టర్స్ చేతనో చేయించాడు. పోనీ ఇప్పుడైనా సరే,స్టార్ డైరెక్టర్ కోసం ఆలోచన చేస్తున్నట్లు లేదు. పైగా మాస్ మూవీస్ కొత్త డైరెక్టర్స్ తో చేయడం కూడా దెబ్బే.

పూరి జగన్నాధ్,రాజమౌళి,శ్రీను వైట్ల ,బోయపాటి,లాంటి కమర్షియల్ డైరెక్టర్స్ ని కాదని, కొత్త డైరెక్టర్స్ తీయడం ప్లాప్ లకు కారణం. శ్రీను వైట్ల దర్శకత్వంలో అనుకున్న మూవీ పక్కన పెట్టేసారు. ఇక పూరి జగన్నాధ్ ఓ సినిమా చెబితే అదీ చైతు వద్దన్నాడు. ఇక బోయపాటితో ఓ సినిమా చర్చల సమయంలోనే వదులుకున్నాడు. ఢమరుకం శ్రీనివాసరెడ్డితో హలోబ్రదర్ సీక్వెల్,దుర్గ మూవీస్ అనుకుని వదులుకున్నాడు. పోనీ దుర్గ టైటిల్ తో వివి వినాయక్ వస్తే అదీ ఒప్పుకోలేదు.