Movies

ఉదయ్ కిరణ్ బయోపిక్ లో ఫ్లాప్ హీరో… బ్రేక్ కోసం మరో ప్రయత్నం

టాలీవుడ్ లో హీరో ఉదయ్ కిరణ్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేని పేరు.చిత్రం సినిమాతో చిన్న వయసులో టాలీవుడ్ లో హీరోగా అరంగేట్రం చేసి వరుసగా మూడు హిట్ లతో క్రేజీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.

అయితే ఉదయ్ కిరణ్ జీవితం సినిమా ఇండస్ట్రీలో హీరోగా వెలిగిపోవాలని వచ్చే ప్రతిఒక్కరికి ఆదర్శం అని చెప్పాలి.అతని కెరియర్లో ఇమేజ్ ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంతే వేగంగా ఫ్లాప్ లతో అవకాశాలు కోల్పోయాడు.కెరియర్ లో చాలా హీనమైన స్థితికి వచ్చేసి ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు.ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతూ ఉంటారు.

నిజానికి అతని లైఫ్ లో ఎం జరిగింది అనేది ఎవరికీ తెలియని విషయం.సినిమా అవకాశాలు లేక, మరో కెరియర్ ఎంచుకోలేక మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని టాలీవుడ్ లో అందరూ భావిస్తూ ఉంటారు.ఉదయ్ కిరణ్ చనిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.మరల మరోసారి టాలీవుడ్ లో అతని గురించి న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఒకే ఒక్క సక్సెస్ తో మోస్ట్ ఫెయిల్యూర్ హీరోగా ఉన్న సందీప్ కిషన్ ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది.డిసెంబర్ లో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ బయోపిక్ టాలీవుడ్ లో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."