Movies

ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో..ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు!!!

సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి పలుసినిమాలతో దుమ్ముదులపడమే కాదు,పెద్దయ్యాక స్టార్ హీరోగా రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే స్టార్ హీరోగా రాణిస్తున్న వ్యక్తులను చూస్తే,అతడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడని చాలామందికి గుర్తుకు రాదు. సరిగ్గా అలాంటి హీరో గురించి ప్రస్తావిస్తే, యితడు వయస్సులో చిన్నవాడైనా ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.

అతడు ఎవరో కాదు హీరో రామ్ పోతినేని. అవును అతడే. వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో రామ్ ,ఇలియానా తో జతకట్టి దేవదాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. తొలిసినిమాతోనే అదరగొట్టాడట. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆతర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. మస్కా, కందిరీగ,మసాలా, నేను శైలజ,రెడీ వంటి మూవీస్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సాఫ్ట్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ కాకుండా మాస్ మసాలా క్యారెక్టర్స్ చేస్తూ తానేమిటో నిరూపించుకుంటున్నాడు.

అయితే రామ్ చిన్నపుడు కూడా నటించాడని చాలామందికి తెలీదు. తమిళంలో 13వ ఏట ఓ షార్ట్ ఫిలిం లో నటించాడు. దాంతో ఇంటర్ నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చింది. అంతేకాదు అవార్డు సొంతం చేసుకున్నాడు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి దేవదాస్ తో హీరో గా వెండితెరకు పరిచయం అయ్యాడు. దేవదాస్ సమయానికి అతడి వయస్సు 18ఏళ్ళు మాత్రమే. అయినా చాలా ఈజీగా నటించి, అందరినీ ఆకట్టుకున్నాడు. ఈమధ్య పెద్దగా హిట్స్ రాకపోవడంతో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ దుమ్మురేపింది. ఈ మూవీలో పక్కా తెలంగాణా యాసతో డైలాగ్స్ చెబుతూ తన సత్తా చాటాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."