Movies

2019లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ వీరే

ప్రతియేటా చాలామంది ఇతర భాషా చిత్రాల తరాలు తెలుగులో నటిస్తున్నారు. 2019లో కూడా ఇలా చాలామంది వచ్చారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీతో ప్రియాంక తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇంకా ఛాన్స్ లు కొట్టెయ్యడానికి సిద్ధం అవుతోంది. బాలీవుడ్,కోలీవుడ్ ,శాండిల్ వుడ్ ఇలా అన్నీ కవర్ చేసిన శ్రద్ధా శ్రీనాధ్ ఈ ఏడాది జెర్సీ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేసింది. మజిలీ మూవీలో నాగ చైతన్య హీరోగా వచ్చిన మజిలీ మూవీతో దివ్యాన్ష్ కౌశిక్ ఎంటర్ అయింది.

సాహో మూవీతో తెలుగులో చేసిన శ్రద్ధ కపూర్ అంతకుముందు వివిధ భాషల్లో నటించింది. గోపీచంద్ నటించిన చాణక్య మూవీలో కూడా ఈమె నటించింది. కత్రినా తో సల్మాన్ ఖాన్ బ్రేక్ అప్ సమయంలో జెరీనాను డూప్ గా పెట్టి సినిమా తీశారు. చాణక్య మూవీతో తెలుగులో నటించేసింది . ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో చక్కటి రోల్ తో తెలుగులో శృతి శర్మ ఎంట్రీ ఇచ్చింది. మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో వాణీ భోజన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. చాలామందికి తేలిగ్గా కనెక్ట్ అయ్యే అనన్య మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అలాగే ఫలక్ నుమా సినిమాతో సలోని శర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమాలో కూడా హర్షిత గౌర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. నిను వీడను నీడను నేనే మూవీతో సన్యాసి తెలుగులో ఎంట్రీ ఇచ్చేసింది. హైదరాబాద్ కి చెందిన గాగ్గేయి ఎల్లాప్రగడ సైకాలజీలో బ్యాచులర్ డిగ్రీ చేసి,ఈ ఏడాది సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. సుకృత వాగ్లే కన్నడ నుంచి వచ్చి,రామ సక్కని సీత మూవీతో తెలుగులో నటించింది. సాయికుమార్ అబ్బాయి ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీతో శేషా చెట్టి ఎంట్రీ ఇచ్చింది. రవిబాబు మూవీ అల్లరిలో నటించిన నేహా చౌహన్ కి మంచి మార్క్స్ పడ్డాయి .

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."