Movies

ఫిలింనగర్ లో మహేష్ ఇల్లు చూస్తే షాకవ్వాల్సిందే…అంతా నమ్రత ప్లానింగ్…???

ప్రస్తుత తరంలో టాలీవుడ్ ఆదర్శ జంటగా పేరుతెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ – నమ్రత ల ఇల్లు చూస్తే ఔరా అంటాం. నిజానికి మహేష్ స్టార్ డమ్ వెనక నమ్రత ప్లానింగ్ చాలానే ఉందంటారు. తనకు అన్నీ తానే అయ్యి అంచెలంచెలుగా ఎదిగేందుకు, స్టార్ ని చేయడంలో అలాగే బిజినెస్ మేన్ గా రూపాంతరం చెందించడంలోనూ నమ్రత ప్రణాళికా బద్ధమైన వ్యవహార శైలి ప్రధాన కారణంగా చెబుతుంటారు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌళిలో ఏఎంబీ సినిమాస్ ని ఇంద్రభవనంలా నిర్మించడంలో నమ్రత ప్లానింగ్, కమ్యూనికేషన్, అభిరుచి కలగలిపి ఉన్నాయని సన్నిహితులు చెబుతారు.

దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ ఫిలింనగర్ లో మహేష్ సొంతంగా ఓ ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నాడు. తాజాగా తమ ఇంటికి సంబంధించిన ఫోటోల్ని నమ్రత సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. అత్యంత ఖరీదైన ఈ డిజైనర్ హోమ్ ని చూడగానే షాకవ్వాల్సిందే. ఇందులో ఓ ఫోటో చాలా స్పెషల్ గా ఆకట్టుకుంది. నమ్రత స్వయంగా ఫోటోలు తీస్తున్నప్పుడు ఓ ఫోటోలో తన ప్రతిబింబం నీడ హైలైట్ అయ్యింది. కిడ్స్ గౌతమ్ – సితార ఇంట్లో `లూడో` అనే గేమ్ ఆడుతున్నప్పుడు తీసిన ఫోటోల్ని నమ్రత ఇంతకుముందు రివీల్ చేస్తే అవి హైలైట్ గా నిలిచాయి.

తాజాగా రివీల్ చేసిన ఫోటోల్లోనే నమ్రత ఫ్యామిలీ మెంబర్స్ సహా బంధుమిత్రులు ఉన్నారని ఫోటోల్ని బట్టి అర్థమవుతోంది.ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ సహా ప్రతిదీ నమ్రతనే దగ్గరుండి డిజైన్ చేయించారని అప్పట్లో చెప్పుకున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఈ ఇంటిని డిజైన్ చేశారు. ఎంట్రన్స్ లో ఉడ్ వర్క్, కింద గెస్ట్స్ వెయిటింగ్ రూమ్.. పైన సకల సౌకర్యాలతో బెడ్ రూమ్స్ వగైరా అన్నీ డిజైనింగ్ చేయించుకునేందుకు నమ్రత చాలానే హార్డ్ వర్క్ చేసినట్లు చెబుతారు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."