సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో చేసిన నాలుగు తప్పులు
తెలుగు సినీ రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరుతెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ నిజ జీవితంలో తప్పులు చేశారట. అవును చాలామంది వీటిని ప్రస్తావిస్తారట. నటి కావాలని ఎంతగానో తపించిన కూతురు మంజులను హీరోయిన్ గా రాకుండా అడ్డుపడ్డారట. అది కూడా ఫాన్స్ వత్తిడి వాళ్ళ కావడం విశేషం. కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు లను హీరోలుగా చేయాలనుకున్న కృష్ణ కూతురు విషయంలో మాత్రం డేర్ చేయలేకపోయారు. అయితే కాలక్రమంలో కావ్యాస్ డైరీ ,ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించిన మంజుల మంచి పేరు తెచ్చుకుంది. సమాజం అంటే నాన్నగారి ఫాన్స్ అనే చట్రంలో ఉండిపోవడం వలన తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయానని మంజుల చెబుతుంటుంది.
గాన గాంధర్వ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో వ్యవహరించిన తీరులో కూడా కృష్ణ తప్పుబడతారు విశ్లేషకులు. ఏడాదికి పదేసి సినిమాలు చేస్తున్న సమయంలో చెప్పుడు మాటలు వినడం వలన ఎస్పీ బాలుని కాదని,రాజ్ సీతారాం కి ప్రతిష్టాత్మక సింహాసనం తో సహా అన్ని సినిమాల్లో పాటలు పాడే ఛాన్స్ ఇచ్చారు. పోనీ అలాగైనా స్టాండ్ అయ్యారా అంటే అదీ లేదు. మళ్ళీ ఎస్పీ బాలుకి ఛాన్స్ ఇచ్చేసి, రాజ్ సీతారాం ని పక్కన పెట్టేసారు. దీంతో కెరీర్ మలుపు తిరుగుతున్న దశలో రాజ్ సీతారాం కి ఇచ్చిన మాటను కృష్ణ నిలబెట్టుకోలేకపోయారన్న అపవాదు వచ్చింది.
ఇక డైరెక్టర్ రేలంగి నరసింహారావు అప్పట్లో శోభన్ బాబుతో సంసారం మూవీ చేసాడు. అది హిట్ కొట్టడంతో శాఖమూరి రామచంద్రరావు నిర్మాతగా ఓ సినిమా చేస్తానని కృష్ణ మాటిచ్చాడు. దాంతో కృష్ణ అనుమతి తీసుకుని రచయిత సత్యానంద్ తో కల్సి చర్చలు మొదలుపెట్టాడు. అయితే శాఖమూరి ఇదేమీ తెలియదన్నట్లు పరుచూరి బ్రదర్స్ కి అడ్వాన్స్ ఇచ్చేసాడు. అప్పుడు రేలంగికి విషయం చెప్పడంతో రేలంగి ఖంగు తిన్నాడు అలా చేస్తే ఎలా అంటూ సత్యానంద్ పై గౌరవంతో దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అయితే రేలంగికి మూవీ చేయడం ఇష్టం లేదట అని శాఖమూరి చెప్పడంతో అసలు విషయం తెలుసుకోకుండా రేలంగి పై కృష్ణ ఫైర్ అయ్యాడు.
ఇది కాకుండా ముందడుగు మూవీ తర్వాత కృష్ణతో రామానాయుడు ఓ మూవీ తలపెట్టారు. దర్శకుడిగా కె రాఘవేంద్రరావు ని,రచయితలుగా పరుచూరి బ్రదర్స్ ని పెట్టాలని కృష్ణ కండీషన్ పెట్టడంతో ఒప్పుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాక, తాను మరో ప్రొడ్యూసర్ కి మాటిచ్చానని,అందుకే ఆయనతో షేర్ చేసుకుని ఈ సినిమా చేయాలనీ కృష్ణ చెప్పడంతో రామానాయుడు నొచ్చుకున్నారట. ఇక స్టార్ హీరోలతో ఇలాంటివి పడలేక తన చిన్న కుమారుడు వెంకటేష్ ని కలియుగ పాండవులు మూవీతో ఎంట్రీ చేయించారట.

