Movies

మాటే మంత్రం సీరియల్ అభిమానులకు చేదు వార్త చెప్పిన అలీ రెజా

మాటే మంత్రము సీరియల్ లో పల్లవి రామ శెట్టి,అలీ రాజా హీరో హీరోయిన్స్ గా చేస్తూ,మంచి పాపులార్టీ తెచ్చుకున్నారు. అయితే అలీ రాజా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కారణంగా అతడి క్యారెక్టర్ ని కోమాలోకి వెళ్లినట్లు డైరెక్టర్ చూపించారు. అలీ రాజా వంద రోజుల బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సీరియల్ లోకి వస్తాడని ఎదురుచూస్తుంటే,సీన్ రివర్స్ అయిందట.అవును నిజంగా ఓ చేదువార్త వచ్చిందని అంటున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ, ‘ఎప్పుడొస్తున్నారు,ఎప్పుడు రాబోతున్నారని చాలా మంది నాకు మెసేజ్ లు పెడుతున్నారు. రావాలని ఉన్నా సరే,కొన్ని కారణాలవలన రాలేని పరిస్థితి వచ్చింది’అని పేర్కొన్నాడు.

కొన్ని అగ్రిమెంట్స్ కారణంగా మాటే మంత్రం సీరియల్ లోకి రాలేకపోతున్నానని అలీ రాజా చెప్పాడు. ‘ఇలా చెప్పడం నా బాధ్యతగా భావించి చెబుతున్నానని తెల్పాడు. వేరే మంచి ప్రాజెక్ట్ తో మీముందుకు వస్తాను. ఇన్నాళ్లూ ఆదరిస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు’అంటూ చెప్పుకొచ్చాడు