Movies

నిర్మాత క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకున్న రౌడీ…పారితోషికం వెనక్కి…?

సినిమాల కోసం కోట్ల కోట్లు పారితోషికం తీసుకోవ‌డ‌మే కాదు, అడిగినంత పారితోషికం ఇచ్చిన ఆ నిర్మాత క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకోవాలి కూడా. ఇప్పుడు అదే చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌న తాజా సినిమా `వల‌ర్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` శుక్ర‌వారం విడుద‌లైంది. ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు, తీసిన నిర్మాత న‌ష్టాల్లో కూరుకుపోయారు. అందుకే విజ‌య్ త‌న వంతు సాయం అందించ‌డానికి ముందుకొచ్చాడు. త‌న పారితోషికంలో కొంత భాగం వెన‌క్కి ఇచ్చి, న‌ష్టాల్ని త‌గ్గించాల‌ని భావించాడు.

కె.ఎస్‌.రామారావు ఇప్ప‌టికే కొంత మొత్తం విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కి ఇవ్వాలి. అయితే ఆ డ‌బ్బులు విజ‌య్ తీసుకోవ‌డం లేద‌ట‌. అంతే కాదు.. త‌న పారితోషికంలో కొంత భాగం తిరిగి ఇచ్చేశాడ‌ట‌. అలా.. నిర్మాత కష్టాల్లో ఉన్న‌ప్పుడు త‌న‌వంతుగా ఆదుకున్నాడు. విజ‌య్ వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కాలేక‌పోయాడు గానీ, వ‌ర‌ల్డ్ బెస్ట్ హీరో మాత్రం అయ్యాడిలా.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."