Movies

కుక్క బిస్కెట్స్ తింటున్న టాలీవుడ్ హీరోయిన్…ఎవరో తెలిస్తే షాక్

హీరోయిన్‌ రష్మిక మండన్నాని, హీరో నితిన్‌ ఆటపట్టించాడు. అదీ ‘డాగ్‌ బిస్కెట్స్‌’, ‘పిడిగ్రీ’ అంటూ. అదేంటీ, రష్మికకీ వాటికీ సంబంధమేంటి.? అంటే, రష్మిక ఓ సారి డాగ్‌ బిస్కెట్స్‌ని టేస్ట్‌ చేసిందట. ఆ విషయాన్ని నితిన్‌, తన తాజా సినిమా ‘భీష్మ’ ప్రమోషన్స్‌లో వెల్లడించాడు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా రష్మిక షాక్‌కి గురయ్యింది. నితిన్‌ని కంట్రోల్‌ చేయడానికి రష్మిక చాలా ప్రయత్నించిందిగానీ.. వీలు కాలేదు. నితిన్‌ – రష్మిక మధ్య ఈ ఫన్‌ చాలాసేపు నడిచింది.

‘జస్ట్‌ ఫర్‌ ఫన్‌’ అని నితిన్‌ చెప్పడం, రష్మిక.. ఈ మొత్తం ఎపిసోడ్‌ని మేగ్జిమవ్‌ు ఎంజాయ్‌ చేయడం చాలా క్యూట్‌గా అనిపించింది. తనకు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనే కోరిక చాలా చాలా ఎక్కువనీ, ఈ క్రమంలోనే ఓ సారి డాగ్‌ బిస్కెట్స్‌ టేస్ట్‌ ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకున్నాననీ, ఆ కారణంగానే డాగ్‌ బిస్కెట్‌ని టేస్ట్‌ చేశానని రష్మిక చెప్పింది. ‘ఎలా వుందది.?’ అనడిగితే ‘బాగానే వుంది’ అని రష్మిక సమాధానమిచ్చింది. బహుశా ఇదే, రష్మిక ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏమో.. అని నితిన్‌ సెటైర్లు కూడా వేశాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."