Movies

నితిన్ అత్త-మామల ప్రేమకథ తెలిస్తే షాకవుతారు

జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన నితిన్ తాజాగా నటించిన భీష్మ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇదే సమయంలో షాలిని తో పెళ్లి కి రంగం సిద్ధం. నిజానికి నితిన్ ,షాలిని జంట పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహానికి రెడీ అయ్యారు. ఈనెల 15న ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రీవెడ్డింగ్ వేడుక జరిగింది. ఏప్రిల్ 16న ఘనంగా దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది. అయితే ఇది ఆంధ్రా-తెలంగాణ అనుబంధం అంటూ ఓ ప్రచారం సాగడంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చా సాగింది. అయితే అది నిజమా? అని ఆరాతీస్తే.. చాలా డీప్ మ్యాటర్స్ తెలిసాయి. ఇక నాగర్ కర్నూల్ తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. అంటే ఇది ఆంధ్రా – తెలంగాణ బాండింగ్ కాదు.. లోకల్ తెలంగాణ బాండింగ్ అని తేలింది.

మరికొన్ని షాకింగ్ విషయాల్లోకి వెళ్తే, షాలిని యూకే లో ఎంబీఏ చదువుకున్నారని, వ్యాపార రంగంలో కెరీర్ పరంగా రాణిస్తున్నారని తెలిసాయి. అలాగే షాలిని కుటుంబానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. షాలిని తల్లిదండ్రులు కులమతాలకు అతీతంగా ప్రేమ వివాహం చేసుకున్నారని టాక్. షాలిని తండ్రి హిందువు. మదర్ ఓ ముస్లిమ్ అని తెలుస్తోంది. షాలిని తండ్రి పేరు సంపత్ కుమార్. ఆయన పేరున్న డాక్టర్. తల్లి పేరు నూర్ జహాన్. తనూ ఫేమస్ డాక్టర్ అని తెలుస్తోంది. వీరికి షాలిని రెండవ సంతానం.

అయితే పెళ్లి తర్వాత పేరెంట్ హిందూ మతంలోకి మారారట. వీళ్లంతా నాగర్ కర్నూల్ లో కందనూలు లో నివసిస్తున్నారు. అక్కడే సొంతిల్లు.. కొన్ని వ్యాపారాలు ఉన్నాయట. అలాగే సంపత్ కుమార్ జిల్లా కేంద్రంలో రెండు దశాబ్ధాలుగా ప్రగతి నర్సింగ్ హోమ్ పేరిట ఓ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు.నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న నితిన్ -షాలిని జంటకు పెద్దలు ఏనాడూ అడ్డు చెప్పలేదుట. ఈ విషయం ఇంట్లో ముందే తెలియజేసి ప్రేమాయణం సాగించారని టాక్. మొత్తానికి నితిన్ అత్తమామల ఆదర్శ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రేమకు కులం మతంతో పని లేదు. మంచి మనసు ఉంటే చాలు అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."