Movies

Varun Sandesh:వరుణ్ సందేశ్ ఆ మూడు సినిమాలు చేసి ఉంటే…స్టార్ హీరో అయ్యేవాడా …?

Varun Sandesh:హ్యాపీ డేస్ మూవీస్ తో తెలుగుతెరపై మెరిసిన వరుణ్ సందేశ్ తరువాత కొత్త బంగారు లోకం వంటి సినిమాలతో హిట్ కొట్టినా తర్వాత ఎందుకో చతికిల బడిపోయాడు. హ్యాపీ డేస్ తో వచ్చిన తమన్నా ఇప్పుడు స్టార్ డమ్ తెచ్చుకుంటే, వరుణ్ సందేశ్ ఆ రేంజ్ లో లేడు. దీనికి కారణం చూస్తే కొన్ని కీలకమైన మూవీస్ వదిలేసాడని విశ్లేషకులు అంటారు. సినిమా సెలెక్షన్స్ లో లోపం ఉందనేది పలువురు వాదిస్తుంటారు.

100%లవ్ నాగచైతన్యను హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన మూవీ. అయితే ఈమూవీని వరుణ్ సందేశ్ వదిలేసుకోవడం దురదృష్టంగా ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. ఇక భీమిలి కబడ్డీ జట్టు మూవీ నేచురల్ స్టార్ నానిని ఎస్టాబ్లిష్ చేసింది. దీన్ని వరుణ్ సందేశ్ వదిలేసుకోవడం కూడా పెద్ద తప్పిదంగానే సినీ పండితులు చెబుతారు.

కాగా గుండెజారి గల్లంతయింది మూవీ నితిన్ కి చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చిన సినిమా. అయితే ఈ మూవీని వరుణ్ సందేశ్ వదిలేసుకున్నాడు. ఈ మూడు సినిమాల్లో కూడా దమ్ముంది. సూపర్ హిట్ అవ్వడమే కాదు,మార్కెట్ లో కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఐతే వరుణ్ సందేశ్ చేసివుంటే మంచి లైఫ్ వచ్చేదని ఇమంది రామారావు చెప్పుకొచ్చారు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."