Movies

కోడి రామకృష్ణ కూతుళ్లు ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ దిగ్గజ దర్శకుల జాబితాలలో దివంగత కోడి రామకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది.తెలుగు సినిమాకి గ్రాఫిక్స్ మాయాజాలం పరిచయం చేసిన ఘనత ఆయనకే సొంతం.

ఇప్పుడు రాజమౌళి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్న తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ మాయాజాలంతో అమ్మోరు, దేవీ పుత్రుడు, అంజి, అరుందతి లాంటి సినిమా అద్బుతమైన సినిమాలు తీసిన కోడి రామకృష్ణ పేరు ఎప్పటికి నిలిచిపోతుంది.అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు తీసి ఫైనల్ గా తెలుగుకి హాలీవుడ్ స్టాండర్డ్స్ అందించి విశ్రమించిన దర్శక దిగ్గజంగా ఆయన అందరికి చేరువ అయిపోయారు.

అతని డ్రీం ప్రాజెక్ట్ సత్యసాయి జీవిత చరిత్రని తెరపైకి ఎక్కించకుండానే తనువు చాలించారు.కోడి రామకృష్ణకి ఇద్దరు అమ్మాయిలు.వారు చిత్ర రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లేదు కాబట్టి అతని జాడలు ఇంకా టాలీవుడ్ లో కనిపించే అవకాశం లేదని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా ఆయన కూతుళ్ళు అయిన దీపిక, ప్రవల్లిక కోడి రామకృష్ణ వర్ధంతి సందర్భంగా మీడియా ముందుకి వచ్చారు.

తమ తండ్రి పేరు మీద నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి వరుసగా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నామని తెలిపారు.నాన్నగారు పేరు నిలబెట్టేలా తమ నిర్మాణ సంస్థ ఉంటుందని తెలియజేశారు.దీనికి సంబందించిన అన్ని పనులు ఇప్పటికే జరుగుతున్నాయి.త్వరలో తమ నిర్మాణ సంస్థ గురించి, రాబోయే సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు.మరి నిర్మాతలుగా కోడి రామకృష్ణ కూతుళ్ళు టాలీవుడ్ లో ఎంత వరకు సక్సెస్ అవుతారు అనేది వేచి చూడాలి

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."